Kannappa: మరో వివాదంలో మంచు ఫ్యామిలీ.. కన్నప్ప పోస్టర్‌పై వివాదం

ABN , Publish Date - Jan 08 , 2025 | 08:56 AM

Kannappa: ఇటీవలే ‘కన్నప్ప’ సినిమాలో 'పార్వతి దేవి' పాత్రలో కాజల్ లుక్‌ని రిలీజ్ చేశారు. కాగా, ఇది సరికొత్త వివాదానికి దారితీసింది. ఈ పోస్టర్ పై చాలామంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినప్పటికీ కొందరు మాత్రం మనోభావాలు దెబ్బతీసుకున్నారు.

kajal as parvathy devi

విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా డా. మోహన్ బాబు (Manchu Mohan Babu) నిర్మిస్తున్న ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఈ సినిమాలో 'పార్వతి దేవి' పాత్రలో కాజల్ లుక్ ని రిలీజ్ చేశారు. కాగా, ఇది సరికొత్త వివాదానికి దారితీసింది.


ఇటీవలే 'కన్నప్ప మేకర్స్' రిలీజ్ చేసిన పార్వతి దేవి పోస్టర్ లో కాజల్ తెల్లటి పట్టు చీరలో, హిమాలయ పర్వతాల అడుగున.. ఒక బండరాయి మీద అగర్వాల్ కూర్చున్నట్లు కనిపిస్తోంది. ఆమె వెనుక మహా కాళి అవతారం పొగమంచుతో డిజైన్ చేయబడింది. ఈ పోస్టర్ పై చాలామంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినప్పటికీ కొందరు మాత్రం మనోభావాలు దెబ్బతీసుకున్నారు. ఎందుకంటే పోస్టర్ లో పార్వతీ దేవికి బొట్టు లేదు. కాజల్ ని మోడ్రన్ పార్వతిగా చూపిస్తున్నారా అంటూ పలువురు ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. ఈ లుక్ ని వెంటనే మార్చి, పోస్టర్ ని డిలీట్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికి 'కన్నప్ప' మేకర్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.

GgldoWSXIAAH3et.jpg


మొదట ఈ సినిమా ప్రకటించినప్పుడు ప్రభాస్‌-నయనతారలు శివ పార్వతులుగా కనిపించనున్నారని టాక్‌ వినిపించింది. తాజాగా కాజల్‌ పార్వతీదేవిగా కనిపించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో శివుడిగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ నటించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ కూడా పూర్తయింది. ఇక ఇందులో ప్రభాస్‌ నంది పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ఆర్‌.శరత్‌కుమార్‌, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టీఫెన్‌ దేవస్సే మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘కన్నప్ప’ చిత్రం అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. ఈ చిత్రానికి మోహన్‌బాబు నిర్మాతగా వ్యవహరించడంతోపాటు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్‌ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Updated Date - Jan 08 , 2025 | 09:16 AM