Upendra: కాలర్ ఎగరేస్తూ బయటికొస్తారు
ABN, Publish Date - Nov 23 , 2025 | 12:55 AM
ఏ, ఉపేంద్ర, రక్త కన్నీరు ఈ సినిమాలన్నీ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండటం చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన వ్యక్తిగా ఒక మాట చెప్తున్నాను. ఈ సినిమా చూసి మీరు అందరూ కాలర్ ఎగరేసుకుంటూ బయటికొస్తారు. - Upendra
'తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ నా పాత చిత్రాలు గుర్తు పెట్టుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నటించిన, చూసిన వ్యక్తిగా ఒక మాట చెప్తున్నాను. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు, ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకుంటూ బయటికొస్తారు’ అని ఉపేంద్ర అన్నారు. రామ్ హీరోగా మహేశ్‌బాబు పి దర్శకత్వంలో తెరకెక్కిన ఆంఽధ్రా కింగ్ తాలూక’ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్ర పోషించారకు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్, మెర్విన్ సంగీతం అందించారు. నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది, ఈ సందర్భంగా వైజాగ్‌లో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు.
ఉపేంద్ర మాట్లాడుతూ 'ఏ, ఉపేంద్ర, రక్త కన్నీరు ఈ సినిమాలన్నీ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండటం చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన వ్యక్తిగా ఒక మాట చెప్తున్నాను. ఈ సినిమా చూసి మీరు అందరూ కాలర్ ఎగరేసుకుంటూ బయటికొస్తారు. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. ఎలివేషన్స్ కమర్షియల్ హంగులు, మంచి సాంగ్స్ లవ్వు అన్నీ ఉన్న సినిమా ఇది. రామ్, భాగ్యశ్రీ చక్కని కాంబినేషన్. రామ్ ఎనర్జీని పూర్తి స్థాయిలో చూస్తారు. ఫ్యాన్స్ ఎనర్జీ అంతా ఆయనలో ఉంది’ అన్నారు.
డైరెక్టర్ మహేష్ బాబు మాట్లాడుతూ 'సినిమా తీయడం హైదరాబాద్‌లో నేర్చుకున్నా. కానీ సినిమాలో ఉండే ప్రతి ఎమోషన్ వైజాగ్‌లోనే ఫీలయ్యాను. ఈ కథ వినగానే రవిగారు హగ్ చేసుకున్నారు. అప్పుడే కంటెంట్ మీద మరింత నమ్మకం వచ్చింది. వివేక్ మర్విన్ అద్బుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అదే మా ఫస్ట్ సక్సెస్‌గా భావిస్తున్నాం. భాగ్యరశ్రీ మేం అనుకున్న దానికన్నా 100 రెట్టు బాగా చేసింది. ఒక డైరెక్టర్‌ని డైరెక్ట్ చేయడం చాలా కష్టమైన పని. ఉపేంద్ర గారి దగ్గరికి చాలా భయంతో వెళ్ళాను. ఆయన రియల్ మాన్. ఆయన సపోర్ట్‌ని మర్చిపోలేను. రామ్ లేకపోతే ఈ సినిమా లేదు. సినిమా పట్ల అంత ప్యాషన్ ఉన్న వారిని ఇప్పటివరకూ చూడలేదు. ప్రపంచంలో ఎవర్నో ఒకరిని అభిమానించకుండా ఎవరూ ఉండరు. లైఫ్‌లో ఎన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయో ఒక ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూపిస్తే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా" అన్నారు
నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ 'ఈ రోజుని వైజాగ్‌ని చూస్తే రంగస్థలం ఈవెంట్ గుర్తొచ్చింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఇదే వేదికలో మీ అందరినీ కలవడం ఆనందంగా ఉంది. మంచి కథతో ఈ సినిమా తీసాం. రామ్, ఉపేంద్ర గారి మధ్య ఉండే సీన్స్ అద్భుతంగా ఉంటాయి. అలాగే భాగ్యశ్రీ, రాహుల్ రామకృష్ణ అన్ని క్యారెక్టర్స్ అద్భుతంగా ఉంటాయి. ఒక మెసేజ్ ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో చెప్పడంలో కొరటాల శివ దిట్ట . శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ అందుకు ఉదాహరణ. దర్శకుడు మహేష్ కూడా నెక్స్ట్ కొరటాల శివ అవుతాడని నమ్మకంగా చెబుతున్నాను. చిరంజీవి, బాలకృష్ణ, మహేష్, రామ్ చరణ్ , ఎన్టీఆర్ మాకు అవకాశాలిచ్చారు. ప్రతి అవకాశాన్ని నిలబెట్టుకున్నాము. ఇప్పుడు ప్రభాస్ ఫౌజీ, తారక్ ప్రశాంత్ నీల్ సినిమాలు కూడా అంతే ప్యాషన్‌తో చేస్తున్నాం.