Chaitra J Achar: ‘ఫౌజీ’లో.. కన్నడ బోల్డ్ బ్యూటీ! గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన చైత్ర
ABN, Publish Date - Oct 23 , 2025 | 10:13 PM
ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’ (Fauzi). తాజాగా గురువారం ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకుని మూవీ టైటిల్‌ను రివీల్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రభాస్ (Prabhas), హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’ (Fauzi). తాజాగా గురువారం ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకుని మూవీ టైటిల్‌ను రివీల్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే వేసవిలో ప్రేక్షకుల ఎదుటకు రానుంది. సోషల్ మీడియా ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఇమాన్వీ (Imanvi) కథానాయికగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది.
అయితే.. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఈ మూవీలో కన్నడ సింగర్, నటి చైత్ర జే అచార్ (ChaitraJAchar) కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఆమె స్వయంగా తన ఇన్ స్టా అకౌంట్‌లో పోస్టు చేసింది.
హను అద్భుతమైన క్రియేషన్‌లో భాగమైనందుకు హ్యాపీగా ఫీలవుతున్నా అంటూ వ్రాసుకొచ్చింది. కాగా ఈ ముద్దుగుమ్మకు ఇదే తొలి తెలుగు స్ట్రెయిట్ చిత్రం కావడం గమనార్హం.
ఈ భామ గతంలో రక్షిత్ శెట్టి సప్తసాగరాలు దాటి (Sapta Sagaradaache Ello), రాజ్ బీ శెట్టి టోబీ, దీక్షిత్ శెట్టి బ్లింక్, సిద్దార్థ్ 3BHK వంటి చిత్రాలలో కీలక పాత్రలతో అదరగొట్టింది.
సినిమాలో చాలా వరకు పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లోనే కనిపించిన ఈ బ్యూటీ బయట మాత్రం అంతుకు విరుద్దంగా ఉంటుంది.
సోషల్ మీడియాలో నిత్యం మతులు పోగెట్టేలా గ్లామర్ ఒలకబోస్తూ చూసే వారిని క్షణాల్లో నిగ్రహం కోల్పోయేలా చేయడంలో దిట్ట. వీలుంటే ఈ అమ్మడి ఫొటోలపై ఓ లుక్కేయండి మరి.