Kamakhya Movie Launches: ఉత్కంఠభరిత చిత్రం
ABN, Publish Date - Jul 28 , 2025 | 12:26 AM
సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘కామాఖ్య’. పూజా కార్యక్రమాలతో ఆదివారం ఘనంగా ప్రారంభమైంది...
సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘కామాఖ్య’. పూజా కార్యక్రమాలతో ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ బేనర్‌పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. చిత్ర దర్శకుడు అభినయ కృష్ణ ఈ సినిమా కోసం ఉత్కంఠభరితమైన కథని సిద్ధం చేశారని మేకర్స్ తెలిపారు. ఆనంద్, శరణ్య, ప్రదీప్, వైష్ణవ్, ధన్‌రాజ్, రాఘవ, ఐశ్వర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.