సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bigg BossTelugu9: బిగ్‌బాస్ 9 తెలుగు.. విజేత కల్యాణ్

ABN, Publish Date - Dec 22 , 2025 | 05:56 AM

దాదాపు 15 వారాల పాటూ బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్‌బాస్ సీజన్ 9 (Bigg Boss Telugu9) ముగిసింది.

Bigg BossTelugu9

దాదాపు 15 వారాల పాటూ బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్‌బాస్ సీజన్ 9 (Bigg Boss Telugu9) ముగిసింది. ఆదివారం జరిగిన ఈ గ్రాండ్ ఫినాలేలో కల్యాణ్ పడాల (Kalyan Padala) విన్నర్‌గా నిలిచి, ఈ ఘనత సాధించిన తొలి సామాన్యుడిగా రికార్డు సృష్టించారు. రూ.35 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని వ్యాఖ్యాత నాగార్జున చేతుల మీదుగా అందుకున్నాడు. షో స్పాన్సర్స్ ఆయనకు రూ.ఐదు లక్షలను బహూకరించారు. అలాగే ఓ కారును కూడా సొంతం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'నాకు ఇంతటి మద్దతునిచ్చి విజేతను చేసిన ప్రతీ ఒక్క రికీ కృతజ్ఞతలుస తెలిపారు. సీఆర్పీఎఫ్ జవాన్ అయిన కల్యాణ్‌కు ఈ విజయం ఏమంత సునాయాసంగా దక్కలేదు. అగ్నిపరీక్షలో నెగ్గి, తొలి కామన్ మ్యాన్‌గా ఈ షోలో అడుగుపెట్టాడు. ఎన్నో కష్టాలు ఎదురైనా, తన ఆటతో ప్రేక్షకుల్ని మెప్పించి.. వారి ఓట్లు దక్కించుకుని విజేతగా నిలిచారు. తనూజ (Thanuja) రన్నరప్‌గా నిలిచింది. మూడోస్థానంలో డిమోన్ పవన్ (Demon Pavan), ఇమ్మాన్యుయేల్ (Emmanuel), సంజన గల్రానీ (Sanjana) నాలుగు, ఐదు స్థానాల్లో మిగిలారు.

కాగా.. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' చిత్రం ప్రధాన పాత్రధారులు రవితేజ, డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్, నటుడు శ్రీకాంత్, 'ఛాంపియన్ హీరో హీరోయిన్ రోషన్, అనస్వర రాజన్, 'అనగనగా ఒక రాజు' కథానాయకుడు నవీన్ పొలిశెట్టి, కథానాయిక మీనాక్షీ చౌదరి ఈ కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు. గత ఎనిమిది సీజన్లు అందించిన హంగామాను ఏ మాత్రం మిస్ కానివ్వకుండా సెప్టెంబర్ 7న మొదలైన ఈ బిగ్ బాస్ సీజ న్ 9 ప్రేక్షకులకు ఎంతో వినో దాన్నీ, ఉత్కంఠను పంచింది.

Updated Date - Dec 22 , 2025 | 06:02 AM