Junior: హీరోగా ఎంట్రీ ఇస్తున్న గాలి తనయుడు...

ABN , Publish Date - May 15 , 2025 | 01:39 PM

ప్రముఖ పారిశ్రామిక వేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయం అవుతున్నారు. అతనితో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న 'జూనియర్' మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి (Gaali Janardhan Reddy) ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు ఆయనకు ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. అయితే జైలులో కల్పిస్తున్న వసతులకు అదనంగా మరిన్ని సౌకర్యాలు కల్పించాలంటూ ఆయన తాజాగా నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఇది విచారణలో ఉంది.


STILL_INSTA_Prod-15-Title-Launch_.jpgఇదిలా ఉంటే... గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటీ (Kiriti) ని హీరోగా పరిచయం చేస్తూ 2022లో 'జూనియర్' (Junior) అనే సినిమా మొదలైంది. రాధాకృష్ణ (Radha krishna) దర్శకత్వంలో ఈ సినిమాను సాయి కొర్రపాటి (Sai Korrapati) ప్రొడక్షన్ హౌస్ లో రజని నిర్మిస్తున్నారు. శ్రీలీల (Sreeleela) హీరోయిన్ కాగా జెనీలియా (Genelia), రవిచంద్ర (Ravi Chandra) కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతాన్ని సమకూర్చుతున్న 'జూనియర్' సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో జూలై 18న విడుదల చేయబోతున్నట్టు గురువారం మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు కె. కె. సెంధిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్. పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. తండ్రి జనార్దన్ రెడ్డి ఓ పక్క జైలు జీవితాన్ని గడుపుతుంటే... కొడుకు కిరీటి సినిమా జాతీయ స్థాయిలో విడుదల కానుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Also Read: RAPO22: ‘ఆంధ్రా కింగ్‌ తాలుకా’ టికెట్టు ఇవ్వాల్సిందే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 15 , 2025 | 01:42 PM