సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

July Releases జులైలో లక్కు కిక్కు చూసేదెవరో...

ABN, Publish Date - Jun 28 , 2025 | 05:25 PM

చాలా రోజుల తరువాత రెండు సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి... ఈ ఊపు ఇలాగే సాగాలని టాలీవుడ్ జనం ఆశిస్తున్నారు... ఎందుకంటే జులై నెలలో కూడా కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ జనం ముందుకు రానున్నాయి... దాంతో రాబోయే నెలలో తెలుగు సినిమా ఎలా సాగుతుందోనని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సినీ లవర్స్.

జూన్ నెలలో 'కుబేర (Kubera ), కన్నప్ప (Kannappa)' చిత్రాలు ఇండస్ట్రీకి జోష్ ని పెంచాయి. హిట్‌లు లేక సతమతమవుతున్నవేళ ఈ మూవీస్ కొత్త కిక్ ను ఇచ్చాయి. భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు చూస్తున్నాయి. కుబేర ఐదు రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో చేరుకోగా... కన్నప్ప పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ రెండు సినిమాలతో జూన్ నెలకు శుభం కార్డు పడింది... ప్రస్తుతం అందరి చూపు జులై పై పడింది. వచ్చే నెలలో మూడు ఇంట్రెస్టింగ్ సినిమాలు... డిఫరెంట్ జానర్స్ తో బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఆ యా సినిమాలపై ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ నెలకొంది.. ఈ మూవీస్ తో ఆ స్టార్స్ లైఫ్ కొత్త మలుపు తీసుకుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.


జులై నెలలో సూపర్ ఇంట్రెస్టింగ్ మూవీస్ సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి .జులై 4న యూత్ స్టార్ నితిన్ (Nithin ) నటించిన 'తమ్ముడు (Thammudu)' రిలీజ్ కాబోతోంది. ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. అక్క-తమ్ముడు అనుబంధాల చుట్టూ అల్లుకున్న కథతో మాయ చేయడానికి వచ్చేస్తున్నాడు యూత్ స్టార్ .ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ లో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ , డివోషనల్ టచ్ కూడా యాడ్ అవ్వడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని నితిన్ , సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, లయ ఎదురు చూస్తున్నారు. ఇక బెంగళూరు బ్యూటీ అనుష్క (Anushka) నటించిన 'ఘాటీ' (Ghaati )జులై 11న రిలీజ్ అవుతోంది. అనుష్కని స్క్రీన్‌పై చూసి చాలా రోజులైంది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ బాగానే ఉన్నాయని వినిపిస్తోంది. ఈ రెండు సినిమాల కంటే... పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu)కోసం సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'హరిహరవీరమల్లు' కోసం దాదాపు ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ . ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ మూవీ జులై 24న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ మూవీ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నా అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా 17వ శతాబ్దం నేపథ్యంలో పీరియాడికల్‌ డ్రామాగా వస్తోంది. అంతేకాక మొఘల్స్ కాలంలో ఆంధ్రా నుంచి ఢిల్లీ వరకూ సాగే వీరమల్లు ప్రయాణమే ఈ సినిమా కథ అని టాక్. ఈ మూవీపై అందాల బ్యూటీ నిధి అగర్వాల్ బోలెడు ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో తన లైఫ్ కొత్త టర్న్ తీసుకుంటుందని ఆశపడుతోంది. ఇక అన్ని అనుకున్నట్లుగా జరిగితే అదే నెలలో విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. హిట్ కోసం వేచి ఉన్న నితిన్, చాలా రోజులకు వస్తోన్న అనుష్క, డిప్యూటీ సీయమ్ అయిన తరువాత వస్తున్న పవన్ అందరికీ జులై మాసం ఊరిస్తోంది... మరి ఈ మూడు సినిమాలు ఈ స్టార్స్ కు ఎలాంటి ఫలితం అందిస్తాయో చూద్దాం...

Updated Date - Jun 28 , 2025 | 05:25 PM