NTR: బ్రేకింగ్.. షూట్ లో ఎన్టీఆర్ కి ప్రమాదం
ABN, Publish Date - Sep 19 , 2025 | 05:02 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) కు షూట్ లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) కు షూట్ లో ప్రమాదం జరిగింది. ఒకపక్క డ్రాగన్ షూట్ లో పాల్గొంటూనే ఇంకోపక్క ప్రైవేట్ యాడ్ షూట్ లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. ఆ యాడ్ షూట్ లోనే అనుకోకుండా ఈ ప్రమాదం సంభవించినట్లు ఎన్టీఆర్ ఆఫీస్ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా తెలిపారు.. ఇక ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలు అయ్యాయని, వెంటనే ఆయనను హాస్పిటల్ కు తరలించడం జరిగింది. వైద్యులు ఎన్టీఆర్ కి రెండు వారాలు బెడ్ రెస్ట్ తీసుకోమని సూచించినట్లు ప్రకటనలో తెలిపారు.
ఎన్టీఆర్ ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదు. అందుకు మేము హామీ ఇస్తున్నాం. దయచేసి ఫ్యాన్స్ కానీ, మీడియా కానీ లేనిపోని వార్తలను ప్రచురించవద్దని కోరారు. ఈ విషయం తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.