సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

NTRNEEL: షాకింగ్.. ఎన్టీఆర్- నీల్ మధ్య విభేదాలు .. ఆగిన డ్రాగన్

ABN, Publish Date - Oct 20 , 2025 | 08:24 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న తాజా చిత్రం డ్రాగన్ (Dragon). ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

NTRNEEL

NTRNEEL: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న తాజా చిత్రం డ్రాగన్ (Dragon). ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ నీల్ అని తాత్కాలికంగా టైటిల్ పెట్టినా కూడా డ్రాగన్ అనే టైటిల్ ను ఫ్యాన్స్ కన్ఫర్మ్ చేసేశారు. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం నుంచి ఒక చిన్న అప్డేట్ అయినా వస్తుందా అని అభిమానులు ప్రతి పండగకు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు.

డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డాడు. బాడీ మొత్తాన్ని మార్చేశాడు. బరువు తగ్గాడు.. లుక్ మార్చాడు. ప్రశాంత్ నీల్ సైతం ఎన్టీఆర్ కోసం మంచి కథనే సిద్ధం చేశాడు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎన్టీఆర్ - నీల్ కు మధ్య విభేదాలు తలెత్తాయని, దీనివలనడ్రాగన్ ఆగిపోయిందన్న వార్త నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది.

ఇప్పటివరకు వచ్చిన డ్రాగన్ అవుట్ ఫుట్ ఎన్టీఆర్ కు నచ్చలేదట. మొదటి షెడ్యూల్ చూసి ఎన్టీఆర్ అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందట. దీంతో నీల్ ను స్క్రిప్ట్ లో కొన్ని ఛేంజెస్ చేయమని, ఆ తరువాత షూటింగ్ మొదలు పెడదామని ఎన్టీఆర్ చెప్పినట్లు సమాచారం. దీని వలనే నీల్, ఎన్టీఆర్ కి మధ్య విభేదాలు నెలకొన్నాయని, మేకర్స్ సైతం చర్చించి కొన్ని నెలలు డ్రాగన్ ను ఆపడమే మంచిదని భావించి షూటింగ్ ను ఆపినట్లు టాక్ నడుస్తోంది. త్వరలోనే డ్రాగన్ షూట్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారట. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Oct 20 , 2025 | 08:25 PM