Johnny Master: శేఖర్ మాస్టర్‌తో వివాదం.. జానీ మాస్టర్ షాకింగ్ రియాక్షన్!
ABN , Publish Date - Dec 19 , 2025 | 07:04 AM
జానీ మాస్టర్ భార్య వి.వి. సుమలతా దేవి, తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Choreographer Johnny Master) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన డ్యాన్స్ స్టెప్పులు చాలా వేగంగా, పవర్ ఫుల్ గా ఉంటాయి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ (Tamil), హిందీ (Hindi) భాషల్లో కూడా ఆయన కొరియోగ్రఫీ చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
మరోవైపు శేఖర్ మాస్టర్ (Shekhar Master) మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నుండి ఎన్టీఆర్ (NTR) వరకు అందరు స్టార్ హీరోలతో పనిచేశారు. ముఖ్యంగా 'సామజవరగమనస (Samajavaragama), రాములో రాముల (Ramulo Ramulo) వంటి పాటలతో యూట్యూబ్ రికార్డులు సృష్టించారు. క్లాస్, మాస్ స్టెప్పులను ఎంతో సులభంగా చేయించడం ఈయన ప్రత్యేకత.
వీరిద్దరూ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, 'ఢీ' (Dhee)వంటి పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షోల ద్వారా ఎంతోమంది కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, కేవలం తమ కష్టం మరియు డ్యాన్స్ పట్ల ఉన్న మక్కువతో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్లుగా కెరీర్ మొదలుపెట్టి ఈ స్థాయికి చేరుకోవడం విశేషం.
గురువారం జానీ మాస్టర్ భార్య వి.వి. సుమలతా దేవి (Sumalatha Devi), తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జానీ మాస్టర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శేఖర్ మాస్టర్ తో వివాదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు.
'శేఖర్ మాస్టర్, గణేష్ (Ganesh), భాను (Bhanu) మాస్టర్ గ్రూపులు అంటూ ఏమీ లేవు. వీళ్లంతా నాకు చాలా ఇష్టం. వారంతా షూటింగ్స్ ఉండటం వల్లే ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. మేమంతా కలిసికట్టుగా ఉన్నాము కాబట్టే మన పాటలు పాన్ వరల్డ్ స్థాయికి చేరుతున్నాయి.
ఈ రోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే దానికి ముక్కు రాజు (Mukkaraju) మాస్టరే కారణం. ఆయన యూనియన్ స్థాపించి ఉండకపోతే మేము ఇక్కడ ఉండేవాళ్లం కాదు' అని జానీ మాస్టర్ పేర్కొన్నారు. తన భార్యను ఎన్నికల్లో గెలిపించిన డ్యాన్సర్లకు ఈ సందర్భంగా జానీ మాస్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.