సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jockey: గోట్ ఫైట్ నేపథ్యంలో వస్తున్న జాకీ

ABN, Publish Date - Sep 26 , 2025 | 05:33 PM

యువన్ కృష్ణ(Yuvan Krishna), రిధాన్ కృష్ణన్ , అమ్ము అభిరామి (Ammu abhirami) కీలక పాత్రధారులుగా  డాక్టర్ ప్రగభల్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'జాకీ' Jockey) .

యువన్ కృష్ణ(Yuvan Krishna), రిధాన్ కృష్ణన్ , అమ్ము అభిరామి (Ammu abhirami) కీలక పాత్రధారులుగా  డాక్టర్ ప్రగభల్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'జాకీ' Jockey) . భారతీయ సినిమాలో తొలిసారిగా మట్టి రేసింగ్‌ నేపథ్యంలో రూపోందిన మడ్డీ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే.  ఆ చిత్రం తర్వాత అయన తీసిన సినిమా ఇది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు.  గోట్ ఫైట్ చుట్టు అల్లుకున్న కథ ఇది. కేవలం ఫైట్స్ మాత్రమే కాదు అద్భుతమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థం అవుతుంది. రియల్ లోకేషన్స్ లో చిత్రీకరించడమే కాకుండా 2022 నుంచి అక్కడి సాంస్కృతి సాంప్రదాయాలను అర్థం చేసుకోవడానికి అదే ప్రాంతంలో ఉన్నట్లు డైరెక్టర్ తెలిపారు. సహజసిద్దంగా చిత్రీకరించేందుకు అక్కడి ప్రజలతో మమేకమై, ప్రతీది తెలుసుకొని జాగ్రత్తగా షూట్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. అంతేకాదు సినిమా కావాల్సిన ప్రతీ అంశాన్ని జోడించి ఎంతో గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే ను సెట్ చేసినట్లు,  అందుకోసం నటీనటులు గోట్స్ సంరక్షకులతో కొద్దిరోజులు సవాసం చేసి, వారితో, గోట్స్ తో అనుబంధం పెంచుకున్నట్లు మేకర్స్ తెలిపారు.  పోరాట సన్నివేశాలకోసం శారీరంగా, మానసికంగా రెడీ అయ్యారని అందుకే ప్రతీ సన్నివేశం అద్భుతంగా వచ్చిందని మేకర్స్ తెలిపారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నారు. 

Updated Date - Sep 26 , 2025 | 05:35 PM