సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nihar Kapoor: భల్లాలదేవా పాత్ర నేను చేయాల్సింది.. జయసుధ కొడుకు కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Jul 20 , 2025 | 05:39 PM

సినిమాల్లో నటించే ప్రతి ఒక్కరికి కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. వారి పేరు ఎప్పుడు తలచుకున్నా.. ముందు అదే పాత్ర గుర్తొస్తుంది. అలా రానా దగ్గుబాటి (Rana Daggubati) అనగానే భల్లాలదేవా గుర్తొస్తాడు.

Bahubali

Nihar Kapoor: సినిమాల్లో నటించే ప్రతి ఒక్కరికి కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. వారి పేరు ఎప్పుడు తలచుకున్నా.. ముందు అదే పాత్ర గుర్తొస్తుంది. అలా రానా దగ్గుబాటి (Rana Daggubati) అనగానే భల్లాలదేవా గుర్తొస్తాడు. అది కేవలం ఒక పాత్ర మాత్రమే కాదు. ఒక బ్రాండ్. పాన్ ఇండియా లెవెల్లో ఆ పాత్రకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే రానా కనుక ఈ పాత్ర చేయకపోతే ఎవరు చేసి ఉండేవారు అనే ప్రశ్న చాలామంది మదిలో మెదులుతూనే ఉండేది. తాజాగా ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది.


రానా కనుక భల్లాలదేవగా కనిపించకపోయి ఉంటే.. ఆ ప్లేస్ లో నిహార్ కపూర్ కనిపించేవాడు. ఎవరీ నిహార్ అంటే.. అలనాటి మేటి నటి, సహజ నటి అనే పేరు తెచ్చుకున్న జయసుధ కొడుకే నిహార్. గ్యాంగ్ స్టర్ గంగరాజు అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు. తల్లి పోలిక.. తండ్రి హైట్ పుణికిపుచ్చుకున్న నిహార్ కు తెలుగులో అంతగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్న నిహార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్ని నాయిక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.


ప్రభాస్- రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాలో భల్లాలదేవా పాత్రలో నిహార్ నటించాల్సి ఉందట. దానికోసం శిక్షణ కూడా తీసుకున్నా.. చివరకు ఆ పాత్ర రానానే చేశాడని నిహార్ చెప్పుకొచ్చాడు. 'బాహుబలి సినిమా సమయంలో మొదట భల్లాలదేవా పాత్రకు రానానే అనుకున్నారు. కానీ డేట్స్ అడ్జెస్ట్ కాలేక రానా నో అంటే.. నాకు ఆ ఛాన్స్ వచ్చింది. నాలుగు వారాలు శిక్షణ కూడా తీసుకున్నాను. ఆ తరువాత రానా.. ఆ పాత్రను నేనే చేస్తాను అని చెప్పడంతో.. రాజమౌళి నా దగ్గరకు వచ్చి రానా చేస్తాను అన్నాడు.. కాళకేయ పాత్ర చేస్తావా అని అడిగారు. ఆ పాత్ర గురించి, మేకప్ గురించి అంతా వివరించారు.


అదంతా అమ్మకు చేప్తే.. మొదటి సినిమాలోనే ముఖం కనిపించకుండా ఉంటే ఎవరు గుర్తుపట్టరు అని చెప్పింది. అందుకే ఆ పాత్రను నేను వదులుకున్నాను. ఆ తరువాత సినిమా చూసి కాళకేయ పాత్రలో చాలా మార్పులు వచ్చాయి. నాకు చెప్పినప్పుడు అలా లేదు. అయినా నేను ఆ పాత్రలు చేయనందుకు బాధపడడం లేదు.మొదటి నుంచి నాతో అన్ని విషయాలు రాజమౌళినే మాట్లాడారు. ఎప్పుడు షూటింగ్ వెళ్లి కూర్చొనేవాడిని' అని చెప్పుకొచ్చాడు. అలా బాహుబలి మిస్ అయ్యింది అని నిహార్ చెప్పుకొచ్చాడు. నిహార్ బాడీకి, హైట్ కు భల్లాలదేవాకు బాగానే సూట్ అయ్యేవాడు అని చెప్పొచ్చు.

Updated Date - Jul 20 , 2025 | 05:40 PM