సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ghattamaneni Jayakrishna: 'శ్రీనివాస మంగాపురం'.. అంటున్న కృష్ణ మ‌నువ‌డు

ABN, Publish Date - Nov 27 , 2025 | 09:26 PM

జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రానికి 'శ్రీనివాస మంగాపురం' టైటిల్ ను ఖరారు చేశారు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో రవీనా టాండన్ కుమార్తె టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.

Ghattamaneni Jayakrishna

సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) మనవడు, రమేశ్ బాబు (Rameshbabu) తనయుడు జయకృష్ణ (Jayakrishna) హీరోగా అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ సమర్పణలో ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని పి. కిరణ్ నిర్మిస్తున్నాడు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాశ్‌ కుమార్ (G.V. Prakash Kumar) దీనికి సంగీతం అందిస్తున్నాడు.

అయితే.... ఈ సినిమా వివరాలు బయటకు వచ్చిన దగ్గర నుండి దీనికి 'శ్రీనివాస మంగాపురం' అనే పేరు పెడతారని ప్రచారం జరిగింది. తాజాగా అదే పేరును ఖరారు చేస్తూ, లోగోనూ సైతం చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ప్రేమకథ మీ హృదయాలలో చిరకాలం నిలిచిపోతుందని దర్శకుడు అజయ్ భూపతి తెలిపాడు. ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించడంతో కృష్ణ, మహేశ్‌ బాబు (Mahesh Babu) అభిమానులంతా ఆ శ్రీనివాసుడి దయతో జయకృష్ణ తొలి చిత్రంతోనే సూపర్ హిట్ ను అందుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 27 , 2025 | 09:44 PM