Ari Trailer: ఆసక్తికరంగా ‘అరి’ ట్రైలర్
ABN, Publish Date - Oct 05 , 2025 | 07:25 PM
సైకలాజికల్, మైథలాజికల్ ఎలిమెంట్స్ తెరకెక్కిన చిత్రం ‘అరి’. 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సైకలాజికల్, మైథలాజికల్ ఎలిమెంట్స్ తెరకెక్కిన చిత్రం ‘అరి’ (Ari Movie). 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్9Anasuya bharadwaj), సాయి కుమార్, (Sai kumar)శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జయశంకర్ దర్శకత్వం వహించారు. రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మించారు. ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఆదివారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. (
ట్రైలర్ చూస్తే సైకలాజికల్, మైథలాజికల్ ఎలిమెంట్స్ కలిసిన Ari trailer) డిఫరెంట్ థ్రిల్లర్ గా అనిపిస్తుంది. ఒక లైబ్రరీ, అక్కడ రివీల్ అయ్యే ఏడు జీవితాలను ఆసక్తికరంగా ట్రైలర్ లో చూపించారు. భూలోకంలో జన్మించాలని శ్రీకృష్ణుడు సంకల్పించగానే ఆ విషయం స్వర్గ లోకంలో తెలిసి ఆరుగురు దేవతలు తమనూ భూలోకం తీసుకెళ్లమని శ్రీకృష్ణుడిని వేడుకున్నారు, అవే అరిషడ్వర్గాలు - కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు..' అనే డైలాగ్ తో ‘అరి’ సినిమా ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇక్కడ అందరి కోర్కెలు తీర్చబడును అని ఓ యూనివర్సిటీ లైబ్రరీ నుంచి వెలువడిన ప్రకటన చూసి సినిమాలోని ప్రధాన పాత్రధారులు వచ్చి తమ కోర్కెలు చెబుతుంటారు. ఈ ప్రపంచంలో మనషులందరిలో ఉండే అరిషడ్వర్గాలకు వారి కోర్కెలు ప్రతీకలుగా కనిపిస్తాయి. ఈ పాత్రధారుల నేపథ్యం ఏంటి ?, అందరి కోర్కెలు తీర్చే బాధ్యతను తీసుకున్నది ఎవరు ? తన దగ్గరకు వచ్చే వారికి ఆయన ఇచ్చే టాస్క్స్ ఏంటి ? అనేది థియేటర్స్ లో చూడాల్సిందే.