సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sigma: సిగ్మాగా.. వ‌స్తున్న సందీప్ కిష‌న్‌

ABN, Publish Date - Nov 10 , 2025 | 12:19 PM

త‌మిళ స్టార్ ద‌ళ‌ప‌తి విజయ్ (Thalapathi Vijay) కుమారుడు జాసన్‌ సంజయ్ (Jason Sanjay) సంజయ్ మెగాఫోన్ ప‌ట్టి ద‌ర్శ‌కుడిగా మారిన సంగ‌తి తెలిసిందే.

Sigma

త‌మిళ స్టార్ ద‌ళ‌ప‌తి విజయ్ (Thalapathi Vijay) కుమారుడు జాసన్‌ సంజయ్ (Jason Sanjay) సంజయ్ మెగాఫోన్ ప‌ట్టి ద‌ర్శ‌కుడిగా మారిన సంగ‌తి తెలిసిందే.

ఆయ‌న త‌న తొలి ప్ర‌య‌త్నంగా తెలుగు, త‌మిళ న‌టుడు సందీప్ కిష‌న్ (Sundeep Kishan) తో క‌లిసి భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ (Lyca Productions) లో ఓ చిత్రం రూపొందింస్తున్నాడు.

ఏడాది క్రితం ప్రారంభం అయిన ఈ చిత్రం షూటింగ్ చివ‌రి దశ‌లో ఉంది. 2026 వేస‌విలో ప్రేక్ష‌కుల ఎదుట‌కు తీసుకు రానున్నారు. హైద‌రాబాదీ ఫ‌రియా అబ్దుల్లా (Faria Abdullah) క‌థానాయిక‌గా చేస్తోన్న‌ట్లు స‌మాచారం. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

అయితే.. చాలాకాలం ఎలాంటి అప్‌డేట్‌లు లేని ఈ చిత్రం నుంచి ఎట్ట‌కేల‌కు ఓ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా టైటిల్ను రివీల్ చేశారుజ‌సిగ్మా అనే పేరు టైటిల్ ఖ‌రారు చేశారు. ఈమేర‌కు రిలీజ్‌ చేసిన పోస్ట‌ర్ సైతం ఆ స‌క్తిక‌రంగా ఉంది.

Updated Date - Nov 10 , 2025 | 12:19 PM