Akhanda2: బాలయ్య.. జాజికాయ పాట వచ్చేసింది! థియేటర్లు.. తగలబడాల్సిందే
ABN, Publish Date - Nov 18 , 2025 | 07:48 PM
బాలయ్య.. అఖండ2 తాండవం సినిమా నుంచి జాజికాయ జాజికాయ పాట వచ్చేసింది.
బాలకృష్ణ (Nandamuri Balakrishna), సంయుక్త (Samyuktha) జంటగా బోయపాటి శ్రీను (r Boyapati Sreenu) కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ2 తాండవం (Akhanda 2 Thaandavam). ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌లో 5న ప్రేక్షకుల ఎదుటకు రానుంది. పాన్ ఇండియాగా వస్తున్నన ఈ చిత్రం ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభించిన మేకర్స్ ఇటీవలే ముంబైలో ఓ ఈవెంట్ నిర్వహించారు.. తాజాగా ఏపీ వైజాగ్‌లోని జగదాంబ థియేటర్‌లో మరో ఈవెంట్ నిర్వహించి జాజి కాయ జాజాకియ (Jajikaya Jajikaya)అంటూ సాగే మాస్ బీట్ సాంగ్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు.
ఈ పాటకు కాసర్ల శ్యామ్ ( Kasarala Shyam) సాహిత్యం అందించగా తమన్ (Thaman S) సంగీతంలో బ్రిజేష్ శాండిల్య (Brijesh Shandilya), శ్రేయా గోషాల్ (Shreya Ghoshal)ఆలపించారు. ఇక ఈ పాటను బాలకృష్ణ, సంయుక్తలపై చిత్రీకరించగా సంయుక్త బాగాన ఏఅందాలు అరబోసింది. ఇక అఖండలోని జై బాలయ్య పాట మాదిరి తరహాలోనే ఈ పాట సాగడం గమనార్హం. కాగా పాట విడుదలైన వెంటనే మిలియన్లలో వచ్చేశాయి. నందమూరి ఫ్యాన్స్కు మంచి మీల్స్ పెట్టినట్లుగానే పాట ఉంది.
ఇదిలాఉంటే.. మంగళవారం జరిగిన ఈ వేడుకలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్తా మీనన్, నిర్మాత గోపీ ఆచంట, అంబికా కృష్ణ పాల్గొన్నారు. 'జాజికాయ...' పాట ఆవిష్కరణకు ముందు 'అఖండ-2' మూవీ టీజర్స్ ను ప్రదర్శించారు... ఆ టీజర్స్ ను ఇన్నాళ్ళు యూ ట్యూబ్స్ లో చూసి మురిసిపోయిన అభిమానులు 70 ఎమ్.ఎమ్. స్క్రీన్ పై చూడగానే 'ఒన్స్ మోర్' అంటూ కేకలు వేయగానే, మరోమారు టీజర్స్ ప్రదర్శించారు... ఇక 'జాజికాయ..' సాంగ్ ను ప్రదర్శించగానే అభిమానుల్లో జోష్ నిండింది... ఆ సాంగ్ ను తెరపై వీక్షిస్తున్న బాలకృష్ణ కూడా భలేగా ఎంజాయ్ చేయడం విశేషం! కాకర్ల శ్యామ్ రాసిన 'జాజికాయ...' పాటకు థమన్ బాణీలు భలేగా జోష్ తెప్పించాయి...
'అఖండ-2'లోని "జాజికాయ..." సాంగ్ గతంలో బాలయ్యతో బోయపాటి తెరకెక్కించిన చిత్రాల్లోని జోష్ నింపిన పాటల్లాగే ఉంది... 'అఖండ-1'లో బంతితో ఆడుకుంటూ స్టెప్స్ వేసిన బాలయ్య, ఈ 'జాజికాయ...' సాంగ్ లో టోపీతో మ్యాజిక్ చేస్తూ చిందు వేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది... 'జాజికాయ...' సాంగ్ ఇలా వచ్చిందో లేదో అలా అభిమానులను ఆకర్షిస్తూ సాగుతోంది... ఇక థియేటర్ లో ఈ పాటను ప్రదర్శిస్తూ ఉండగా, బాలయ్య లేడీ ఫ్యాన్స్ సైతం చిందులు వేస్తూ కనిపించారు... ఇక జెంట్స్ సంగతి చెప్పక్కర్లేదు... డిసెంబర్ 5వ తేదీ 'అఖండ-2' వచ్చేలోగా ఈ పాట ఫ్యాన్స్ ను చిందులేయిస్తూనే ఉంటుందని చెప్పవచ్చు...