Kapil Sharma Show: కపిల్ శర్మ షోలో జగపతి కామెంట్స్..
ABN, Publish Date - Sep 12 , 2025 | 06:36 PM
ఒకప్పుడు నటుడిగా జగపతిబాబుకున్న (Jagapathi Babu) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహిళలకు ఆయన అభిమాన నటుడు. హీరోగా అవకాశాలు తగ్గాక నెగటివ్ రోల్స్ వైపు ఆయన టర్న్ అయ్యారు.
ఒకప్పుడు నటుడిగా జగపతిబాబుకున్న (Jagapathi Babu) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహిళలకు ఆయన అభిమాన నటుడు. హీరోగా అవకాశాలు తగ్గాక నెగటివ్ రోల్స్ వైపు ఆయన టర్న్ అయ్యారు. లెజెండ్ సినిమాతో ఆయన విలన్‌గా రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ తిరుగులేదనిపించుకున్నారు. తాజాగా ‘మిరాయ్’తో ప్రేక్షకుల ముందుకువచ్చారు. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. దీని ప్రచారంలో భాగంగా ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో (The Great Indian Kapil Sharma Show) సందడి చేశారు. అందులో జగపతిబాబు పొలిటికల్ కామెంట్‌తో నవ్వులు పూయించారు.
ఈ వేదికపై కొందరు ‘పుష్ప 2’ (Pushpa2) స్కిట్ చేశారు. ఆ సినిమాలో జగపతిబాబు కేంద్రమంత్రి కొగటం వీర ప్రతాప్ రెడ్డి పాత్రలో కనిపించారు. దీని గురించి చెబుతూ సరదాగా కామెంట్ చేశారు. ‘నేను ఇప్పటివరకూ విలన్‌గా నటిస్తున్నాను. రాజకీయాల్లోకి వస్తే నేను హీరో అవుతాను. ఎందుకంటే ఆ రంగంలో ప్రతినాయకులు ఎక్కువ. అప్పుడు నేనే హీరో అవుతాను’ అంటూ నవ్వించారు.
ఇంకా ఈ షోలో పాల్గొన్న శ్రియ తన భర్త ఆంరడ్రూ కోశ్చివ్‌ను తొలిసారి కలిసిన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ‘నేను పొరపాటున విమాన టికెట్ ఒక ప్రాంతానికి బదులు మరో ప్రాంతానికి బుక్ చేసుకున్నా. దీంతో ఒంటరిగా మాల్దీవులకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడే ఆండ్రూని తొలిసారి కలిశాను. ఒకరికిఒకరం తెలియకుండానే ఆ ట్రిప్‌ను ఎంజాయ్ చేశాం. మేమిద్దరం కలిసి చూసిన మొదటి సినిమా ‘దృశ్యం’. ఆ మూవీ చూసి ఆయన భయపడ్డాడు’ అని శ్రియ గుర్తు చేసుకున్నారు. ఇక ‘మిరాయ్’ చిత్రానికి వస్తే ఇందులో శ్రియ తేజ సజ్జాకు తల్లిగా అంబిక పాత్రలో నటించారు.
ALSO READ: Tamannaah Bhatia: త్వరలోనే మీరు అతడిని చూస్తారేమో