సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jagapathi Babu: నాకేదో మాయరోగం వచ్చింది

ABN, Publish Date - Jul 05 , 2025 | 02:31 PM

సీనియర్ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Jagapathi Babu

Jagapathi Babu: సీనియర్ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఫేవరేట్ హీరోగా మారిన జగపతిబాబు.. ఇప్పుడు కూడా సంపూర్ణ నటుడిగా ఎంతోమందికి ఫేవరేట్ గా మారాడు. చివరివరకు హీరోగానే ఉండాలి అని అనుకోకుండా.. విలన్ గా రీఎంట్రీ ఇచ్చి.. ఒకపక్క విలనిజాన్ని చూపిస్తూ.. ఇంకోపక్క సపోర్టింగ్ రోల్స్ లో మెప్పిస్తున్నాడు.


తెలుగు, హిందీ, తమిళ్ అనే తేడా లేకుండా జగ్గూభాయ్ వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. జగపతిబాబుకు సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది అని చెప్పాలి. అదేంటి హీరోయిన్లకు కదా ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు అనుకుంటే పొరపాటే. జగ్గూభాయ్ క్యాప్షన్స్ కు హీరోయిన్స్ కి మించి ఫ్యాన్స్ ఉన్నారు. సాధారణంగా సీనియర్ హీరోలు ఏవైనా ఫొటోస్ పెడితే విమర్శలు రావడం చూస్తూనే ఉంటాం. ఈ వయస్సులో ఇంత స్టైల్ అవసరమా.. ? ముసలోడే కానీ మహానుభావుడు ఇలాంటి కామెంట్స్ చూస్తూనే ఉంటాం.


అయితే జగ్గూభాయ్ మాత్రం ఒకరితో అనిపించుకోవడం ఎందుకు మనకు మనమే విమర్శించుకుంటే పోలా.. ? అని ప్రతి ఫోటోకు తనను తాను తిట్టుకుంటూ ఒక క్యాప్షన్ ఇచ్చుకొస్తాడు. ఆయన ఫోటోలకు ఆయనే వీడు కొంచెం ఓవర్ చేస్తున్నాడు. వయస్సు పెరిగింది కానీ ఇంకా బుద్ధి మారలేదు.. ఇలాంటి క్యాప్షన్స్ తో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. నిజం చెప్పాలంటే జగపతిబాబు ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తాడు. మనసుకు ఏది అనిపిస్తే దాన్ని చెప్పుకొచ్చేస్తాడు. అది ఆయన అన్నాకూడా పట్టించుకోడు.


తాజాగా జగపతిబాబు వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. అందులో ఆయన బోట్ లో తిరుగుతూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను చూపించాడు. ఇక ఈ వీడియోకు జోరుగా హుషారుగా షికారు పోదుమా అనే సాంగ్ ను కూడా యాడ్ చేశాడు. ఇక్కడవరకు బాగానే ఉన్నా క్యాప్షన్ లో మాత్రం తనకు ఏదో మాయరోగం వచ్చిందేమో అని సందేహపడ్డాడు. దానికి కారణం ఎంజాయ్ చేస్తున్నా కానీ, ముఖంలో మాత్రం ఆ ఎంజాయ్ మెంట్ లేకపోవడమే. దీంతో తనకు ఏం మాయరోగం వచ్చిందో అని తనకు తానే తిట్టేసుకున్నాడు. ' హాయిగా.. జోరుగా.. హుషారుగా ఎంజాయ్ చేసాను. కానీ, ముఖం అలా లేదని నాకు తెలుసు. ఏం మాయి రోగం వచ్చిందో' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Updated Date - Jul 05 , 2025 | 02:31 PM