సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Peddi: పెద్దిలో అప్పలసూరిగా స్టార్ నటుడు.. గుర్తుపట్టారా ఎవరో

ABN, Publish Date - Dec 29 , 2025 | 04:23 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సానా (Buchibabu Sana)దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది (Peddi).

Peddi

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సానా (Buchibabu Sana)దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది (Peddi). వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, చికిరిచికిరి సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రామ్ చరణ్ బర్త్ డే కానుకగా మార్చి 27న పెద్ది రిలీజ్ కు సిద్దమవుతుంది. తాజాగా పెద్ది చిత్రం నుంచి జగపతి బాబు లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అప్పలసూరి పాత్రలో ఆయన కనిపించనున్నట్లు తెలిపారు. ఒక ముసలివాడు పాత్రలో జగపతి బాబు కనిపించాడు. సడెన్ గా చూస్తే అసలు అది జగపతి బాబు అని గుర్తుపట్టడం చాలా కష్టం. అంత న్యాచురల్ గా ఉంది మేకోవర్. లుక్ ని బట్టి మంచి పాత్ర అని తెలుస్తోంది.

రంగస్థలంలో జగపతి బాబుకు మంచి పాత్ర దొరికింది. సర్పంచ్ గా ఆయన నటన.. చరణ్ తో ఆయనకున్న సీన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అలాంటి సినిమా తరువాత మళ్లీ పెద్దిలో జగపతి బాబు అప్పల సూరి పాత్రలో కనిపించబోతున్నాడు. దీంతో సినిమాపై హైప్ మరింత ఎక్కువైంది. బుచ్చి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా కూడా రంగస్థలం అంతా హిట్ అవుతుందేమో చూడాలి.

Updated Date - Dec 29 , 2025 | 04:24 PM