Ranveer Singh: మేం ఎవరినీ ఇబ్బందిపెట్టం.. మా జోలికి వస్తే వదిలిపెట్టం..

ABN , Publish Date - May 10 , 2025 | 03:32 PM

భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై (Operation Sindoor) సినీతారలు సెలబ్రిటీ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై (Operation Sindoor) సినీతారలు సెలబ్రిటీ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు వీరోచితంగా పోరాటం చేస్తున్న భారత వీర సైనికులను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అండగా ఉంటామని దేశవ్యాప్తంగా పౌరులు మద్దతు పలుకుతున్నారు. బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer singh) పెట్టిన పోస్ట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. సైనికులకు సెల్యూట్‌ చేస్తూ దీనిపై స్పందించారు. ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించిన ఇమేజ్‌ను పంచుకున్నారు.

‘‘ఎవరి పనులు వాళ్ళు చేసుకునే వారిని మేం ఇబ్బంది పెట్టం. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని మా జోలికి వస్తే మాత్రం వదిలి పెట్టం. మన సాయుధ దళాలు ధైర్యానికి సెల్యూట్‌. ఈ ఆపరేషన్‌లో వ్యూహత్మకంగా వ్యవహరిస్తోన్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు’’ అని అన్నారు. ఇప్పటికే ఆపరేషన్‌ సిందూర్‌పై చిరంజీవి, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, అక్షయ్‌ కుమార్‌, రితీశ్‌ దేశ్‌ముఖ్‌, నిమ్రత్‌ కౌర్‌లు, సెలీనా జైట్లీ, రూపా గంగూలీ తదితరులు సైనికుల సేవలను కొనియాడారు. ‘మీ వెంటే మేమున్నామని’ మద్దతు పలుకుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.  

Updated Date - May 10 , 2025 | 03:33 PM