The Raja Saab: దేవుడా..! ప్రభాస్ రాజాసాబ్‌కు.. కొత్త తలనొప్పి
ABN, Publish Date - Aug 13 , 2025 | 05:10 PM
ది రాజా సాబ్ సినిమా ఏ ముహూర్తానా ప్రారంభించారో కానీ సహనానికి పరీక్ష పెడుతోంది.
ఇప్పటికే షూటింగ్‌లు బంద్, నిర్మాతలు, ఫెడరేషన్ వివాదం వంటి సమస్యలు ఏటూ తేలక ఎక్కే గడప దిగే గడపగా ఉండి టాలీవుడ్‌ను కాకావికలం చేస్తుండగా తాజాగా ఓ సరికొత్త వివాదం ఇప్పుడు అందరికీ షాక్ ఇచ్చింది. కల్కి తర్వాత ప్రభాస్ (Prabhas) డిఫరెంట్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం ది రాజా సాబ్ (The Raja Saab). పాన్ ఇండియాగా హర్రర్, కామెడీ జానర్‌లో వస్తున్న ఈ సినిమా ఏ ముహూర్తానా ప్రారంభించారో కానీ నిత్యం వార్తల్లో ఉంటూ, సినిమా రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతోంది. ఇప్పటికే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్, అక్కడి నుంచి క్రిస్మస్ ఇప్పుడు తాజాగా డిసెంబర్ నుంచి వచ్చే జనవరికి ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోండగా. బుధవారం సరికొత్త గా ఓ పిడుగు లాంటి వార్త బయటకు వచ్చి రాజా సాబ్ సినిమా విషయంలో అసలేం జరుగుతందిరా అనే వరకు వచ్చింది. దీంతో అసలు సంక్రాంతికైనా సినిమా విడుదల ఉంటుందా లేక మొత్తానికే ఆగుతుందా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ది రాజ్ సాబ్ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ People Media Factory (PMF) బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ (Vishwa Prasad) నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా కోసం 2023లో ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ (IVY Entertainment Pvt. Ltd) భారీ పెట్టుబడులు పెట్టింది. అయితే తాజాగా ఈ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రాజాసాబ్ చిత్ర నిర్మాణానికి తాము రూ.218 కోట్ల భారీ మొత్తం పెట్టుబడిగా పెట్టామని వాటిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (PMF) సరైన విధంగా వినియోగించలేదని ఆరోపించింది. పైగా. ఒప్పందం ప్రకారం నిర్ణయించిన గడువులో షూటింగ్ పూర్తి చేయలేదని, సినిమా మేకింగ్‌కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదని, ఖర్చుల వివరాలు వెల్లడించకపోవడం వంటి అంశాలను పిటిషన్‌లో ప్రస్తావించారు. అయితే.. తాము పెట్టుబడిగా పెట్టిన రూ. 218 కోట్ల మొత్తాన్ని 18% వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని, సినిమా హక్కులను ఎవరికీ విక్రయించకుండా, సినిమా పూర్తి చేసి విడుదల చేసే హక్కులు తమకే శాశ్వతంగా దక్కేలా దేశాలు ఇవ్వాలంటూ పిటీషన్‌లో కోరింది.
ఇదిలాఉంటే.. ఇప్పుడు ఈ సమస్యకు సంబంధించి మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజాసాబ్ సినిమా కోసం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory (PMF) ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ (IVY Entertainment Pvt. Ltd) మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఐవీ ఎంటర్‌టైన్ మెంట్ రూ. 225 కోట్ల పెట్టుబడిగా పెట్టాల్సి ఉండగా PMF కి రూ. 218 కోట్లను చెల్లించింది, కానీ తరువాత వివిధ కారణాలు చూపిస్తూ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరింది. దానికి PMF అంగీకరించలేదు, పైగా వారు పెట్టిన పెట్టుబడి మొత్తానికి మించి PMF రాజసాబ్ లో ఇన్వెస్ట్ చేసి సినిమా షూటింగ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో PMF, IVY పైన లీగల్ నోటీసు ఇచ్చింది. దానికి బదులుగా IVY మరో లీగల్ నోటీసు ఇచ్చింది. ఈ రెండు సూట్లు ఢిల్లీ హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. లాస్ట్ హియరింగ్ సందర్భంగా.. చిత్రం విడుదలకు ముందే కోర్టు సమక్షంలో IVY పెట్టిన మొత్తం వడ్డీతో కలిపి ఇచ్చేస్తామని PMF కోర్టుకు ఒక ప్రతిపాదన సమర్పించింది. ఈక్రమంలో ఇక ఈ రాజాసాబ్ సినిమాతో IVYకి ఎటువంటి హక్కు లేకుండా చూడాలని కొరింది. దీంతో కోర్టు IVYకి కౌంటర్ ప్రతిపాదన ఇవ్వాలని కలిసి సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలంటూ ఉత్తర్వు జారీ చేసింది. అనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.