Mass Jathara: నాగవంశీ కి 'బాహుబలి' గండం
ABN, Publish Date - Oct 07 , 2025 | 03:43 PM
మాస్ మహారాజా రవితేజ (Raviteja) ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. గతేడాది ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అవేమి ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి.
Mass Jathara: మాస్ మహారాజా రవితేజ (Raviteja) ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. గతేడాది ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అవేమి ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. ఇక ఈ ఏడాదిలో మాస్ జాతర (Mass Jathara) అంటూ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్దమయ్యాడు. మాస్ మహారాజా రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాస్ జాతర. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamsi) నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ధమాకా రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకుంది.
ఇక మాస్ జాతరపై ప్రేక్షకులు బాగానే అంచనాలు పెట్టుకున్నారు. అన్ని బావుండి ఉంటే ఈ పాటికీ ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉండేది. కానీ, కొన్ని కారణాల వలన మాస్ జాతర అక్టోబర్ 31 కి వాయిదా పడింది. అయితే అదే రోజు బాహుబలి ది ఎపిక్ రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఇదే మాస్ జాతరకు పెద్ద గండంగా మారింది. రెండు పెద్ద సినిమాల మధ్య పోటీ అనేది సాధారణమే. కానీ, ఇక్కడ ఒక రీరిలీజ్.. మరో కొత్త సినిమా పోటీ పడడం.. అందులోనూ రీరిలీజ్ సినిమానే ఎక్కువ హైప్ తెచ్చుకోవడం అనేది విశేషంగా మారింది.
బాహుబలి ది ఎపిక్ ను కూడా రీ రిలీజ్ అనలేం. బాహుబలి 1, బాహుబలి 2 రెండు పార్ట్స్ ను కలిపి.. అనవసరమైనవి తీసేసి.. కొత్త సీన్స్ యాడ్ చేసి.. సరికొత్త సినిమాగా రిలీజ్ చేస్తున్నాడు జక్కన్న. అంతేకాకుండా ఈ సినిమా ఎండింగ్ లో ఒక పెద్ద సర్ ప్రైజ్ ని కూడా యాడ్ చేసినట్లు నిర్మాత శోభు యార్లగడ్డ చెప్పుకొచ్చాడు. దీంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఇంకోపక్క మాస్ జాతర కూడా అంతే హైప్ తెచ్చుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా నాగవంశీ ఎలాగైనా ఈ సినిమాను గట్టెక్కించాలని చాలా కష్టపడుతున్నాడు.
ఇప్పటికే నాగవంశీ.. చిత్రబృందంతో వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టాడు. లిరికల్ సాంగ్స్ ఒకపక్క, సోషల్ మీడియాలో హైప్ పెంచడానికి తనదైన రీతిలో ప్లాన్ చేస్తున్నాడు. అయితే రాజమౌళి ప్రమోషన్స్ ఎలా ఉంటాయో అందరికీ తెల్సిందే. కొత్త సినిమా అయినా.. రీరిలీజ్ అయినా ఆయన స్ట్రాటజీనే వేరు. ఊరికే ప్రభాస్ అలా కనిపిస్తే చాలు హైప్ దానంతట అదే పెరిగిపోతుంది. అందుతున్న సమాచారం ప్రకారం బాహుబలి ది ఎపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్, రానా, స్వీటీని కూడా తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నాడట జక్కన్న. ఇదే కనుక జరిగితే.. మాస్ జాతర గురించి పట్టించుకునేవారే ఉండరు అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఇక వసూళ్ల గురించి చెప్పనవసరం లేదు. బాహుబలి ది ఎపిక్ కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. మొదటిరోజు కనుక మాస్ జాతర హిట్ టాక్ కనుక అందుకోలేదు అంటే బాహుబలి ముందు నిలబడడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందులోనూ రవితేజకు అంత హిట్ ట్రాక్ కూడా లేదు. నాగవంశీ పరిస్థితి కూడా ఇంచు మించు అలానే ఉంది. ఇప్పుడు నాగవంశీకి బాహుబలి గండం చుట్టుకుంది. బాహుబలి దెబ్బ నుంచి రవితేజ, నాగవంశీ బయటపడగలరా లేదా.. అనేది చూడాలి.
Srikantha Addala: కిరణ్ అబ్బవరం మూవీ డైరెక్టర్ మారిపోయాడా...
80S Stars Reunion: చిరుత థీమ్‌తో ఆటలుపాటలు.. మధుర జ్ఞాపకాలు.. వీడియో వైరల్..