Nari Nari Naduma Murari: శర్వా.. సంక్రాంతికి రావట్లేదా
ABN, Publish Date - Dec 31 , 2025 | 07:17 PM
విలక్షణమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్ (Sharwanand). శతమానం భవతి, మహానుభావుడు, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్.. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు.
Nari Nari Naduma Murari: విలక్షణమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్ (Sharwanand). శతమానం భవతి, మహానుభావుడు, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్.. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. తనను తాను సరికొత్తగా మలుచుకుని బైకర్ సినిమాతో గట్టిగానే ట్రై చేసినా, ఆ చిత్రం ఎప్పుడు వస్తుందో తెలియని డైలమాలో పడిపోయింది. ఈ క్రమంలోనే రాబోయే సంక్రాంతిపై భారీ ఆశలు పెట్టుకున్నాడు మన శర్వానంద్.
నిజానికి ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి సినిమాతో థియేటర్లలో సందడి చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే శర్వాకు గట్టి పోటీ ఎదురయ్యేలా కనిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద వాతావరణం గరం గరంగా ఉంది. ప్రభాస్ రాజాసాబ్ సినిమా సాంగ్స్, టీజర్లతో ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తోంది. అటు మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మన శంకరవరప్రసాద్ గారు సినిమా కూడా ప్రమోషన్లలో వేగం పెంచేశాయి. అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలు కూడా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టేశాయి. ఈ భారీ చిత్రాల మధ్య నారీ నారీ నడుమ మురారి టీమ్ మాత్రం కాస్త సైలెంట్‌గా ఉండడం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారింది. శర్వానంద్ మూవీకి సంబంధించి ఎలాంటి హడావిడి కనిపించడం లేదు.
సాధారణంగా పండగ సీజన్‌లో నిలబడాలంటే సినిమాకు ఓ రేంజ్‌లో హైప్ ఉండాలి. కానీ చిత్ర యూనిట్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు అనిపించడం లేదు. రీసెంట్‌గా డైరెక్టర్ భాను భోగవరపు పుట్టినరోజు నాడు ఒక పోస్టర్ వదిలారు. కనీసం ఆ పోస్టర్‌లోనైనా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇస్తారనుకుంటే.. కేవలం విషెస్‌తోనే సరిపెట్టేశారు. దీంతో ఈ సంక్రాంతి రేసు నుంచి శర్వానంద్ తప్పుకుంటున్నాడా అనే సందేహాలు మొదలయ్యాయి. ఒకవైపు భారీ అంచనాలు ఉన్న సినిమాలు, మరోవైపు ప్రమోషన్స్ లేకపోవడం.. ఇవన్నీ చూస్తుంటే మురారి సినిమా వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమా ప్రమోషన్స్‌ను న్యూ ఇయర్ సందర్భంగా మొదలు పెట్టే అవకాశాలున్నట్లుగా తెలుస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 14న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్‌కు జోడీగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.