Iruvuru Bhaamala Kaugililo: 'ఇరువురు భామల కౌగిలిలో' మొదలైంది
ABN, Publish Date - Nov 09 , 2025 | 03:01 PM
‘కమిటీ కుర్రాళ్లు’ ఫేమ్ త్రినాథ్ వర్మ (trinath varma) హీరోగా, వైష్ణవి కొల్లూరు (vaishnavi kolluru) , మలినా హీరోయిన్లుగా 'ఇరువురు భామల కౌగిలిలో’ (Iruvuru Bhaamala Kaugililo) చిత్రం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది.
‘కమిటీ కుర్రాళ్లు’ ఫేమ్ త్రినాథ్ వర్మ (trinath varma) హీరోగా, వైష్ణవి కొల్లూరు (vaishnavi kolluru) , మలినా హీరోయిన్లుగా 'ఇరువురు భామల కౌగిలిలో’ (Iruvuru Bhaamala Kaugililo) చిత్రం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. ఇందులో అక్షర గౌడ కీలకపాత్రలో నటిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో అచ్యుత్ చౌదరి తెరకెక్కిస్తున్నారు. దీపా ఆర్ట్స్ పతాకంపై శ్రీనివాస గౌడ్ నిర్మిస్తున్నారు.
పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి నిహారికా కొణిదెల క్లాప్‌నివ్వగా బి.గోపాల్ కెమెరా స్విచాన్ చేశారు. కె.రాఘవేంద్రరావు స్క్రిప్ట్‌ను నటీనటులు, దర్శక, నిర్మాతలకు అందచేశారు. ఫస్ట్‌షాట్‌కి కోదండరామిరెడ్డితో పాటు నిర్మాత, కెమెరామెన్ ఎస్ గోపాల్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రానికి సంగీతం– శీను భీట్స్, డిఓపి– శశాంక్ శ్రీరామ్, మాటల రచయిత– శ్రీధర్ సీపాన, ఎడిటర్– రాఘవేంధ్ర వర్మ.