సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akhanda 2: అఖండ 2లో బజరంగీ భాయిజాన్ చైల్డ్ ఆర్టిస్ట్ .. పోస్టర్ అదిరింది

ABN, Publish Date - Jul 02 , 2025 | 07:39 PM

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)- బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోకు ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Akhanda 2

Akhanda 2: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)- బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోకు ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సింహా, లెజెండ్, అఖండ.. ఇలా వీరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా ఒక రికార్డ్ ను సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ కాంబో అఖండ 2 (Akhanda 2) తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖండ సినిమా బాలయ్య కెరీర్ ను ఏ రేంజ్ గా మలుపుతిప్పింది అన్న విషయం అందరికీ తెల్సిందే.


ఇక ఇప్పుడు అఖండ తాండవం చేయడానికి బాలయ్య సిద్దమయ్యాడు. ఈసారి మొదటి పార్ట్ ను మించి రెండో భాగం ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో అందరికి తెల్సిందే. అఖండ 2 లో ఆది పినిశెట్టి విలన్ గా కనిపిస్తుండగా.. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా మరో అందమైన బ్యూటీని కూడా అఖండ 2 లో నటిస్తుందని మేకర్స్ తెలిపారు.


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయిజాన్ సినిమా గుర్తుంది కదా. అందులో అతనితో కలిసి నటించిన చిన్నారి ఎందరి మనసులనో ఆకట్టుకుంది. ఆ చిన్నారి పేరు హర్షాలీ మల్హోత్రా. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలను అందుకున్న హర్షాలీ.. అఖండ 2 తో తెలుగుతెరకు పరిచయమవుతుంది. తాజాగా మేకర్స్ హర్షాలీని అధికారికంగా సినిమాలోకి ఆహ్వానించారు. జనని అనే పాత్రలో హర్షాలీ నటిస్తుందని తెలిపారు. నిండుగా తెలుగుదనం ఉట్టిపడేలా హర్షాలీ లుక్ ఆకట్టుకుంటుంది.


అఖండ లో చిన్నారి పాత్ర అందరికీ గుర్తే ఉంటుంది. ఆ చిన్నారితో ఉన్న అనుబంధం ప్రేక్షకులను అలరించింది. అఖండ చివరిలో పెద్ద బాలకృష్ణ చెయ్యి పట్టుకొని తనతోనే ఉండమని అడుగుతుంది. ఇప్పుడు ఆ చిన్నారి పాత్రలోనే హర్షాలీ కనిపిస్తుందని అంటున్నారు.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25 న రిలీజ్ కానుంది. మరి బాలయ్య సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది అంటే హర్షాలీ మంచి బోణి కొట్టినట్టే అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా హర్షాలీకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Shirish Reddy: చరణ్ ను అవమానించలేదు.. గేమ్ ఛేంజర్ వివాదంపై శిరీష్ రెడ్డి వివరణ

Updated Date - Jul 02 , 2025 | 07:40 PM