సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Excellence Award: శ్రీనివాస్ నేదునూరికి  క్రియేటివ్ రైటర్, డైరెక్టర్ అవార్డ్

ABN, Publish Date - Jun 24 , 2025 | 09:16 PM

సంధ్యారాగం చిత్రంతో విమర్శకుల ప్రసంశలు అందుకుని ఉత్తమ దర్శకుడిగా పలు  పురస్కారాలు అందుకున్న దర్శకుడు శ్రీనివాస్ నేదునూరి రచన,దర్శకత్వ విభాగాలలో కనపరుస్తున్న ప్రతిభను గుర్తించి బెస్ట్ క్రియేటివ్ రైటర్, డైరక్టర్  పురస్కారం వరించింది

'సంధ్యారాగం'(Sandhya raagam) చిత్రంతో విమర్శకుల ప్రసంశలు అందుకుని ఉత్తమ దర్శకుడిగా పలు  పురస్కారాలు అందుకున్న దర్శకుడు శ్రీనివాస్ నేదునూరి (Srinivas Nedunuri) రచన,దర్శకత్వ విభాగాలలో కనపరుస్తున్న ప్రతిభను గుర్తించి బెస్ట్ క్రియేటివ్ రైటర్ & డైరక్టర్  పురస్కారం వరించింది .వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికి గుర్తింపు కల్పించేందుకు విజన్ స్టూడియోస్ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 'ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ (Icon of Excellence Award) 2025'  కార్యక్రమం  హైదరాబాద్  దసపల్లా హోటల్‌లో  వైభవంగా జరిగింది.

వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన వ్యక్తులకు  ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్  ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై అవార్డులను ప్రదానం చేశారు.  

పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ  "విజన్ స్టూడియోస్ అధినేత రమేష్ కింద స్థాయి నుంచి ఎదిగి 11 ఏళ్లుగా సంస్థను విజయవంతంగా నడుపుతున్నారు. హైదరాబాద్‌ను బాలీవుడ్‌ సహా అన్ని సినిమాలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిశానిర్దేశంలో సినీ రంగ అభివృద్ధికి నిబద్ధంగా పనిచేస్తాం. అవార్డులు పొందినవారికి అభినందనలు" అని తెలిపారు.

అవార్డు గ్రహీత  శ్రీనివాస్ నేదునూరి మాట్లాడుతూ " బెస్ట్ క్రియేటివ్ రైటర్ & డైరక్టర్ గా నన్ను గుర్తించిన విజన్ స్టూడియోస్ రమేష్ గారికి కృతజ్ఞతలు. మేడం వెన్నెల గద్దర్ గారి  చేతుల మీదుగా ఈ పురస్కారం దక్కడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవార్డు  నాపై మరింత భాద్యత పెంచిందని , ప్రస్తుతం కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, ఈ కోవలోనే  ఓ చిత్రం త్వరలో  తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం సోల్ ఫర్ సేల్  ( SOUL FOR SALE)  వెబ్ సిరీస్ రూపొందిస్తున్నట్లు తెలిపారు.  త్వరలో ట్రైలర్ రిలీజ్ చేసి ఓ ప్రముఖ ప్లాట్ ఫార్మ్ లో ఈ 6 ఎపిసోడ్స్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. 

ఈ  వేడుకకు విశిష్ట అతిధులుగా తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్పర్సన్, ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె డా. గుమ్మడి వి.వెన్నెల, టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్,నటి దివ్యవాణి, ప్రొడ్యూసర్ రామసత్యనారాయణ, ప్రొడ్యూసర్ లయన్ సాయి  వెంకట్  హాజరై సినీ రంగంతో పాటు ఇతర పరిశ్రమలకు చెందిన  ప్రతిభావంతులకు అవార్డులను ప్రదానం చేశారు. ప్రతిభను ప్రోత్సహించేందుకు విజన్ స్టూడియోస్ చేసిన ఈ ప్రయత్నం ప్రశంసనీయమని పేర్కొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 09:24 PM