సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Priyanka Mohan: డబ్బులిచ్చి దుష్ప్రచారం చేయిస్తున్నారు 

ABN, Publish Date - Sep 20 , 2025 | 08:52 AM

తనకు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు డబ్బులిచ్చి మరీ దుష్ప్రచారం చేయిస్తున్నారని హీరోయిన్‌ ప్రియాంకా అరుల్‌ మోహన్‌ ఆవేదన వ్యక్తం చేశారు,

Priyanka Mohan

తనకు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు డబ్బులిచ్చి మరీ దుష్ప్రచారం చేయిస్తున్నారని హీరోయిన్‌ ప్రియాంకా అరుల్‌ మోహన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘డాక్టర్‌’, ‘డాన్‌’, ‘ఎదర్కుమ్‌ తుణిందవన్‌’, ‘కెప్టెన్‌ మిల్లర్‌’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించిన ప్రియాంకా.. అటు తెలుగులో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో  ‘ఓజీ’ చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో తనపై మీమ్స్‌ రూపంలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఆమె స్పందించారు. ‘నేనంటే ఇష్టపడని కొందరు సోషల్‌ మీడియాలో మీమ్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు. ఇలాంటి వాటికి కొందరు డబ్బులిస్తున్నారు. ఇలాంటి వాటికి నేను ఏమాత్రం భయపడను. ఎవరు మీమ్స్‌ పోస్ట్‌ చేసినా నాకేంటి’ అని పేర్కొన్నారు. 

గంభీర జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర

ఇంకా  'ఓజీ’ చిత్రం  గురించి మాట్లాడుతూ 'రెండున్నరేళ్లుగా ఈ సినిమా కోసం ప్రయాణం చేస్తున్నా. దీని ద్వారా పవన్‌ కల్యాణ్‌తో కలిసి నటించే అవకాశం రావడం నాకు ప్రతిరోజూ అదృష్టమే. అందుకే ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.  ఇందులో నేను కణ్మణి పాత్రలో కనిపిస్తాను. ఓజాస్‌ గంభీర జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర ఇది. ఇప్పటి దాకా నేను చేసిన రోల్స్ లో నాకెంతో ఇష్టమైనది.. ప్రత్యేకమైనది ఈ పాత్రే. ఇది పూర్తిగా యాక్షన్‌ సినిమా కాదు. ఇందులో బలమైన ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. దాని చుట్టూ యాక్షన్‌ ఓ భాగంగా ఉంటుంది.  1980-90లలో ముంబయి నేపథ్యంగా సాగే కథగా కనిపిస్తుంది. పవన్‌తో పాటు నా పాత్రను మలిచిన తీరు.. ఆహార్యం ఆ కాలానికి తగ్గట్లే ఉంటుంది. గంభీర పాత్రతో గాఢమైన ప్రేమలో పడటం, అతని జీవితం మలుపు తిరగడం ఈ సినిమాకి కీలకం.


ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు

పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల్లో గెలవడానికి ముందు సెట్లో ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవారు. పుస్తకాలు చదువుకుంటూ కనిపించేవాళ్లు. సెట్లోకి వచ్చే తన పార్టీ సభ్యులతో మాట్లాడుతుండేవారు. ఎన్నికల్లో గెలిచి, ఉప ముఖ్యమంత్రి అయ్యాక హ్యాపీగా ఉన్నారు. చాలా ప్రశాంతంగా.. మరింత బాధ్యతగా కనిపిస్తున్నారు. అప్పటితో పోల్చితే ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు.  ప్రజల గురించే ఆలోచిస్తుంటారు. పెద్ద హోదాలో ఉన్నప్పటికీ సింపుల్‌గా ఉంటారు. ఆయనలో అది నాకెంతో నచ్చుతుంది.  

కింద కూర్చుంటే.. ఆయన పక్కనే 

పవన్‌ కల్యాణ్‌ క్రేజ్‌కు అవధుల్లేవు. నేను బెంగళూరులో ఉన్నప్పుడే ఆయన క్రేజ్‌ గురించి నాకు తెలుసు. నేను ఊహించిన దాని కన్నా ఎక్కువ క్రేజ్‌ ఉందని  ఆయనతో కలిసి పని చేశాకే  తెలిసింది.  సెట్లో అందర్నీ సమానంగా చూస్తారు. సింపుల్‌గా నేలపైనా.. మెట్లపైనా కూర్చోడానికి ఇష్టపడతారు. ఆయనలా కింద కూర్చుంటే నేనూ వెళ్లి పక్కనే కింద కూర్చునేదాన్ని. నాకు పుస్తకాల గురించి మాట్లాడేవారు. తెరపైనా.. తెర వెనుకా ఆయన రియల్‌ హీరోనే’

Updated Date - Sep 20 , 2025 | 09:00 AM