సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Krithi Shetty: సినిమాలు.. మానేద్దాం అనుకున్నా

ABN, Publish Date - Dec 09 , 2025 | 05:48 AM

‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మగా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన కృతి శెట్టి (Krithi Shetty) నటించిన కొత్త‌ త‌మిళ‌ చిత్రం వా వాతియార్‌.

Krithi Shetty

‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మగా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన కృతి శెట్టి (Krithi Shetty) నటించిన కొత్త‌ త‌మిళ‌ చిత్రం (Vaa Vaathiyaar). కార్తీ (Karthi) హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘అన్నగారు వస్తారు’గా తీసుకువ‌స్తున్నారు. ఈ నెల 12న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె.. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కెరీర్‌ తొలినాళ్లను గుర్తు చేసుకున్నారు. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ వల్ల చాలా ఇబ్బందులకు గురైనట్లు తెలిపారు. ‘నేను నటించిన తొలి సినిమా ‘ఉప్పెన’ నా జీవితాన్ని మార్చేసింది. ఆ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను. ఎప్పుడూ ఇది చేయడం కష్టం అని చెప్పలేదు. కానీ నటిగా సినిమాల విషయంలో నాకంటూ కొన్ని అంచనాలు ఉన్నాయి. దాంతో ఒత్తిడి ఉండేది.

ఆ ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. దాంతో నా తల్లిదండ్రులు ‘కష్టంగా ఉంటే సినిమాలు మానేయి’ అని సలహా ఇచ్చారు. దీంతో సినిమాలు చేయడం మానేద్దాం అనుకున్నాను. కానీ ‘ఉప్పెన’ సినిమాతో వచ్చిన ప్రేక్షకాదరణతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు’ అని చెప్పారు. కార్తీ కథానాయకుడిగా నటించిన ‘అన్నగారు వస్తారు’ చిత్రాన్ని నలన్‌ కుమారస్వామి తెరకెక్కించారు.

Updated Date - Dec 09 , 2025 | 10:10 AM