Hyper Aadhi: హీరోల మీద ట్రోల్స్.. ఇచ్చిపడేసిన హైపర్ ఆది
ABN, Publish Date - Nov 19 , 2025 | 03:51 PM
ప్రియదర్శి (Priyadarshi), ఆనంది(Anandi)_ జంటగా నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా తెరకెక్కిన చిత్రం ప్రేమంటే (Premante). సుమ కనకాల (Suma Kanakala) ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
Hyeper Aadhi: ప్రియదర్శి (Priyadarshi), ఆనంది(Anandi)_ జంటగా నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా తెరకెక్కిన చిత్రం ప్రేమంటే (Premante). సుమ కనకాల (Suma Kanakala) ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ (SVCLLP) బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. ఇక ప్రేమంటే సినిమా నవంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ పెంచిన మేకర్స్ గతరాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో జబర్దస్త్ నటుడు, కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadhi).. హీరోలపై వస్తున్న తరోల్స్ గురించి గట్టిగా క్లాస్ తీసుకున్నాడు. వాళ్ళు సాధించిన విజయాల గురించి తెలియకుండా ఇస్తాం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యాడు.
'తెలుగు సినిమా అంటేనే ఒక ఎమోషన్. తెలుగు సినిమాను నిలబెట్టింది నందమూరి రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి అయితే.. ప్రపంచంలో ఎక్కడకు వెళ్ళినా తెలుగు సినిమా అని చెప్పుకొనేలా చేసింది మాత్రం రాజమౌళి గారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీని పీడిస్తున్న ఐ బొమ్మను మూయించేశారు. ఇక దీనికన్నా పెద్ద దరిద్రం సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ. ఇండస్ట్రీకి వచ్చిన కొత్త హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు ఈ నెగిటివిటీ ఉంటుంది. మాన తెలుగు సినిమాను, మన దేశాన్ని తలెత్తుకునేలా చేసిన రాజమౌళి లాంటి వాళ్లు ఒక పోస్టర్ వదిలితే.. దాని మీద ట్రోల్ చేసి ఆయన కూడా తల దించుకునేలా చేస్తున్నాం.ఆ ఈవెంట్ లో అనుకున్న టైంలో అనుకున్న సమయంలో గ్లింప్స్ ఇవ్వలేదని ఎమోషనల్ అయ్యాడు. అంటే ఆయనకు సినిమా పట్ల ఉన్న హార్డ్ వర్క్ గురించి , డెడికేషన్ గురించి మనం హ్యాట్సాఫ్ చెప్పాల్సింది పోయి అందులో కూడా ఏవో కారణాలు వెతుక్కుని ఎలాగోలా ట్రోల్ చేయాలని చేస్తున్నారు. అసలు అక్కడ తప్పు జరగలేదు. ఆయన నాకు రామాయణం, మహా భారతం ఇష్టమని చెప్పాడు. రాముడి గురించి సినిమా తీసే అవకాశం నాకు వచ్చింది అని చెప్పిన వ్యక్తి హనుమంతుడిని తిడతాడా.. ఆరోజు రాజమౌళి హనుమంతుడి మీద అలిగాడు కానీ అవమానించలేదు. ఇది అందరు గుర్తు పెట్టుకోవాలి.
ఇలా ఒకరు కాదు సినిమా కోసం ఎన్టీఆర్ సన్నబడితే ఆయన మీద ట్రోలింగ్.. బాలకృష్ణ మాట్లాడితే ట్రోలింగ్.. అల్లు అర్జున్ నవ్వితే ట్రోలింగ్.. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయ్యి మాట్లాడటానికి ఇబ్బందిగా ఉంటే దాని మీద కూడా ట్రోలింగ్.. బయట వెళ్తే మనం బాహుబలి అంటే మీరు ఇండియన్ అని చెప్పుకునే అలాంటి ప్రభాస్ లుక్స్ మీద ట్రోలింగ్.. రామ్ చరణ్ చికిరి సాంగ్ వేరే దేశాల వాళ్లు కూడా రీల్స్ చేస్తున్నారు. అలాంటి స్టెప్పుల మీద ట్రోలింగ్.. విజయ్ దేవరకొండ మీద మన ఇండస్ట్రీ వాళ్లే ట్రోలింగ్.. ఒక వ్యక్తిని అంత మానసికంగా కృంగదీయాల్సిన అవసరం ఏంటి. బాహుబలి, RRR, పుష్ప ఎలాగో ఒక వర్గానికి అర్జున్ రెడ్డి అలా.. అతని బౌన్స్ బ్యాక్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా ట్రోల్స్ చేస్తే అతను ఎంత ఇబ్బంది పడతాడో ఆలోచించాలి. తెలుగు అమ్మాయి శ్రీలీల ఇక్కడ నుంచి బాలీవుడ్, తమిళ్ లో సినిమాలు చేస్తుంటే.. ఆ అమ్మాయి డాన్స్ వేస్తుంది కానీ యాక్టింగ్ పెద్దగా చేయదని ట్రోలింగ్. భగవంత్ కేసరి సినిమా నేషనల్ అవార్డ్ కొట్టింది అంటే బాలకృష్ణ తో పాటు శ్రీలీల పర్ఫార్మెన్స్ రీజన్ కాదా..అలాంటి అమ్మాయిని బ్లేమ్ చేయడం ఏంటి.
చివరకు మెగాస్టార్ చిరంజీవి మీద డీప్ ఫేక్, ఏఐ వీడియోలు చేశారు. ఇంతకన్నా దరిద్రం ఏదైనా ఉంటుందా.. నాకు తెలిసి ఆయన రికార్డుల పోస్టర్స్ గోడల మీద అతికించే టైం కి ఆ ట్రోలింగ్స్ చేసే వాడు అమ్మ కడుపులో కూడా పడి ఉండడు. ఆయన మూడు దశాబ్దాలు ఒకటో నెంబర్ పొజిషన్ లో ఉన్నప్పుడు ట్రోల్ చేసే వాడికి అసలు నెంబర్ 1 అంటే ఏంటో కూడా తెలియదు. మనం తుఫాన్ వచ్చినా ఆ తుఫాన్ లో మనం పరుగెత్తి ఆయన సినిమాలు చూడటానికి వెళ్తుంటే వాడికి నడవడం కూడా వచ్చి ఉండదు. వాడు వచ్చి మెగాస్టార్ చిరంజీవి మీద ట్రోల్స్ చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఒక స్టేట్ కో.. ఒక క్యాస్ట్ కో సంబంధించిన వ్యక్తి కాదు. దేశం గర్వించదగ్గ వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ట్రోలింగా. హీరోల మీద ట్రోలింగ్ చేయడం వల్ల సినిమా చనిపోతుంది. రేపొద్దున తెర మీద హీరోయిజం చేసినా కామెడీ అవుతుంది. అందుకే హీరోయిజం ఫెయిల్ అవుతుంది. కాబట్టే సినిమాలు ఫెయిల్ అవుతున్నాయని ఆయన అన్నారు. ఈ ట్రోల్స్ చేసే వాళ్లు..నిర్మాతల గురించి ఆలోచించండి. వాళ్ళే కాదు సినిమా కోసం పనిచేసేవాళ్ళ కష్టాన్ని మొత్తం ఒక చిన్న నెగిటివిటీతో చంపేస్తున్నారు. ట్రోలింగ్ ఎప్పుడు నవ్వుకొనేలా ఉండాలి కానీ, నవ్వులపాలు చేసేలా ఉండకూడదు. ఇంతమంది లెజెండ్స్ ఏదో సాధించడానికి వచ్చారు. వారిని ఈజీగా నెగిటివ్ చేయకండి అని చెప్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.