Upendra Re-Release: ఉపేంద్ర రీ రిలీజ్.. 25 ఏళ్ల తర్వాత కూడా కల్ట్ క్లాసిక్‌కు తెలుగులో భారీ రెస్పాన్స్!
ABN, Publish Date - Oct 09 , 2025 | 04:16 PM
రెండు దశాబ్దాల క్రితం కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర స్వయంగా దర్శకత్వం వహించి నటించిన చిత్రం ఉపేంద్ర
రెండు దశాబ్దాల క్రితం కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర స్వయంగా దర్శకత్వం వహించి నటించిన చిత్రం ఉపేంద్ర (UPENDRA). రవినా టాండన్, ప్రేయ కథానాయికలుగా నటించారు. అయితే కల్ట్ క్లాసిక్‌గా పేరొందిన ఈ సినిమాను ఇప్పుడు మైత్రీ డిస్ట్రిబ్యూషన్ సంస్ద (Mythri Release). తెలుగులో రీ రిలీజ్ (UPENDRA Re-Release) చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ చూసిన వారంతా ఉపేంద్ర డైరెక్షన్, యాక్టింగ్, చర్చించిన స్టోరీకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ముఖ్యంగా సినిమాలో డైలాగ్స్ పై చర్చ నడుస్తొంది. అప్పట్లోనే ఇప్పటి జనరేషన్‌కు, వచ్చే తరాలకు సైతం నచ్చేలా ఉపేంద్ర మంచి మెసెజ్ ఓరియెంటెడ్ సినిమా తీశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాతో ఈ ట్రైలర్ విపరీతంగా షేర్ అవుతోంది.
ఇదిలాఉంటే ఈ సినిమా 1999 ఆక్టోబర్ 22న విడుదలై సంచలన విజయం సాధించగా ఇప్పుడు సరిగ్గా పాతికేళ్ల తర్వాత అదే అక్టోబర్ నెల11న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తుండడం విశేషం.