Hreem Movie: సందీప్ కిషన్ క్లాప్ తో...

ABN , Publish Date - Jul 31 , 2025 | 03:29 PM

పవన్ తాతా, చమిందా వర్మ జంటగా నటిస్తున్న సినిమా 'హ్రీం'. ఈ సినిమాలో నటించడానికి దుబాయ్ నుండి చ్చిన చమిందా డాక్టర్ కూడా!

Hreem movie

పవన్‌ తాతా, చమిందా వర్మ జంటగా నటిస్తోన్న చిత్రం ‘హ్రీం’. రాజేశ్‌ రావూరి (Rajesh Ravoori) ఈ చిత్రంతో దర్శకునిగా మారనున్నారు. శివమ్‌ మీడియా పతాకంపై సుజాత (Sujatha) సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివ మల్లాల (Siva Mallala) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ప్రముఖ హీరో సందీప్‌ కిషన్‌ (Sandeep Kishan) క్లాప్‌నివ్వగా, నటులు అలీ (Ali), బెనర్జీ (Benarji), ప్రముఖ ఆడిటర్ విజయేంద్రరెడ్డి, సినిజోష్‌ అధినేత రాంబాబు పర్వతనేని.... దర్శకుడు రాజేశ్‌కి స్క్రిప్ట్‌ని అందించారు. నటులు రాజీవ్‌ కనకాల (Rajeev Kanakala) కెమెరా స్విచ్చాన్ చేశారు.


సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ, 'నా మొదటి సినిమా నుండి ఈ చిత్ర నిర్మాతతో పరిచయం ఉంది. నాకున్న అతికొద్ది మంది మీడియా ఫ్రెండ్స్‌లో శివ మల్లాల ఎంతో ముఖ్యుడు. ఆయన తీస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని అన్నారు. ఈ చిత్ర నిర్మాతలు తనకు కుటుంబ సభ్యులతో సమానమని అలీ చెప్పారు. ఈ సినిమాలో తానో మంచి పాత్ర పోషిస్తున్నానని బెనర్జీ తెలిపారు.


WhatsApp Image 2025-07-31 at 3.13.32 PM.jpeg

రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ, 'ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్ర పోసిస్తున్నాను. ‘హ్రీం’ చిత్ర హీరోయిన్‌ చమిందా వర్మ నటి మాత్రమే కాదు. దుబాయ్‌ నుండి తెలుగులో నటించటానికి వచ్చిన తెలుగమ్మాయి. ఆమె డాక్టర్‌ కూడా. ఈ చిత్రంలో నటిస్తున్న పవన్‌ తాతా, దర్శకుడు రాజేశ్‌ తో నాకు ముందు నుండి పరిచయం ఉంది. వారిద్దరికి ఎంతో టాలెంట్‌ ఉంది. ఇప్పుడు నాకు 50 ఏళ్లు. నాకు 25 ఏళ్లున్నప్పటినుండి ‘హ్రీం’ చిత్ర నిర్మాత శివ మల్లాల తెలుసు. ఈ సినిమా పెద్ద స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. సినిమా ప్రారంభోత్సవంలో దర్శక, రచయిత జనార్థన మహర్షి, నిర్మాత కె. బాబురెడ్డి, తమిళ నిర్మాత జి. సతీష్‌ కుమార్, ‘ట్రెండింగ్‌లవ్‌’ దర్శకుడు హరీష్‌ నాగరాజ్, ‘బహిష్కరణ’ చిత్ర దర్శకుడు ముకేష్‌ ప్రజాపతి , ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ బెజవాడ బేబక్క, వనిత , శ్రీవాణి త్రిపురనేని తదితరులు పాల్గొన్నారు.

Also Read: Rashmika Mandanna: ‘కింగ్డమ్‌’ రష్మిక ఎమోసనల్‌ ట్వీట్‌..

Also Read: Kingdom: కింగ్ డమ్ మూవీ రివ్యూ

Updated Date - Jul 31 , 2025 | 03:35 PM