Bigg Boss 9: వైల్డ్ కార్డ్ ఎంట్రీతో.. సుహాసిని..
ABN , Publish Date - Sep 23 , 2025 | 02:56 PM
టీవీ నటి సుహాసిని (Suhasini) బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో (Biggboss 9) అడుగుపెట్టనున్నారు. ఈ రెండు వారాల్లో ఇద్దరు ఇంటి సభ్యులు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.
టీవీ నటి సుహాసిని (Suhasini) బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో (Biggboss 9) అడుగుపెట్టనున్నారు. ఈ రెండు వారాల్లో ఇద్దరు ఇంటి సభ్యులు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పలువురు కంటెస్టెంటట్‌లు హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. 'చంటిగాడు' చిత్రంతోపాటు పలు హిట్ సీరియల్స్‌లో నటించిన సుహాసిని, కొత్తగా హౌస్‌లో అడుగుపెట్టనున్నారని తెలిసింది. ఆమె ఎంట్రీ హౌస్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, బలమైన వ్యక్తిగా నిలబడుతుందని, గేమ్స్ సవాల్‌గా ఆడే సత్తా ఉందని ఆమె అభిమానులు చెబుతున్నారు.
సీజన్ 9లో ఇప్పుడు మూడో వారం జరుగుతోంది. ఆటలో కొత్తదనం ఏమి లేదు. ఏదో సోసోగా షో సాగుతోంది. కొంతమంది ఇంటి సభ్యులకు ఓటింగ్ కూడా సరిగ్గా లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా సీరియల్ యాక్టర్స్ ఎంట్రీ తప్పకుండా షోకి మంచి మైలేజ్ ఇస్తుందని భావిస్తున్నారు. సుహాసినికి స్మాల్ స్క్రీన్ పై మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి బిగ్ బాస్ 9 ఆమె వచ్చిన తర్వాత మరింత బజ్ పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం హౌస్ లో ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీక్ అన్నది తెలుస్తుంది. ఐతే కొంతమంది ఇంకా ఓపెన్ అవ్వకుండా సేఫ్ గేం ఆడుతున్నారు. సో వాళ్ల ముసుగు కూడా తొలగించే టాస్క్ లు వస్తే ఏం జరుగుతుంది అన్నది చూడాలి.