Bandla Ganesh: బండ్ల దివాళీ పార్టీ ఖర్చు రూ. 2 కోట్లు..
ABN , Publish Date - Oct 20 , 2025 | 05:24 PM
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganeshj) ఇచ్చిన దివాళీ పార్టీ గురించే ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganeshj) ఇచ్చిన దివాళీ పార్టీ గురించే ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఇండస్ట్రీ మొత్తానికి బండ్ల గ్రాండ్ దీపావళీ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేయగా.. .హీరో శ్రీకాంత్ , వెంకటేష్, నిర్మాత నవీన్ ఎర్నేని, యంగ్ హీరోలు తేజా సజ్జ, సిద్దు జొన్నలగడ్డ , లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌళి తనూజ్ తో పాటు చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారు.
ఇక చిరును కారు దిగి కాళ్లు మొక్కి లోపలి ఆహ్వానించిన దగ్గరనుంచి వెళ్లిపోయేవరకు బండ్ల తన అభిమానాన్ని చూపిస్తూనే ఉన్నాడు. చిరు కోసం స్పెషల్ గా ఒక సింహాసనాన్ని కూడా రెడీ చేయించాడు. ఆయనను అందులో కూర్చోబెట్టి తెగ మురిసిపోయాడు. ఆ విషయాన్నీ ఎక్స్ వేదికగా కూడా చెప్పుకొచ్చాడు. 'మా బాస్ చిరంజీవి మా ఇంటికి వస్తారని.. ఆయనపై ప్రేమతో నేను ప్రత్యేకంగా ఒక సింహాసనం తయారు చేయించాను. ఆయన మా ఇంటికి వచ్చి.. ఆ సింహాసనంపై కూర్చోవడంతో నా మనసు ఉప్పొంగిపోయింది' అంటూ రాసుకొచ్చాడు.
ఇక బండ్ల ఈ పార్టీకి పెట్టిన ఖర్చు గురించి తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. బండ్ల పార్టీకి పెట్టిన ఖర్చుతో ఒక చిన్నపాటి సినిమా తీయొచ్చు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ పార్టీకి దాదాపు రూ. 2 కోట్లు అయ్యిందంట. కేవలం భోజనాలకే కోటి దాటిందని చెప్పుకొస్తున్నారు. ఒక్కో ప్లేట్ అన్నీ ఐటెమ్స్ తో కలిపి రూ. 15 వేలు అంట. మిగతా డెకరేషన్, ఖర్చులు ఇంకో కోటి అని టాక్. ఇప్పటివరకు ఇండస్ట్రీలో జరిగిన కాస్ట్లీ పార్టీ ఇదే అని చెప్పుకొస్తున్నారు. అయితే బండ్ల సడెన్ గా ఇంత కాస్ట్లీ పార్టీ ఇవ్వడానికి కారణం ఏంటి అనేది మాత్రం మిస్టరీగా మారింది. కేవలం ఆయన రీఎంట్రీ కోసమేనా.. లేక వేరే ఏదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.
Anaganaga Oka Raju: ప్రమోషన్స్ చేయడంలో నవీన్.. జాతిరత్నం అంతే
Kiran Abbavaram: గ్యాప్ ఇవ్వు అన్నా.. ఇప్పుడేగా హిట్ కొట్టింది.. అప్పుడే ఇంకొకటా