Anaganaga Oka Raju: ప్రమోషన్స్ చేయడంలో నవీన్.. జాతిరత్నం అంతే
ABN , Publish Date - Oct 20 , 2025 | 03:49 PM
కుర్ర నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Anaganaga Oka Raju: కుర్ర నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా రావడం అనేది నవీన్ ప్రత్యేకత. జాతిరత్నాలు తరువాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో వచ్చాడు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక దాని తరువాత నవీన్ నటిస్తున్న చిత్రం అనగనగా ఒక రాజు. చెప్పాలంటే ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ, కొన్ని కారణాల వలన ఆగుతూ వచ్చింది. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.
మొదట ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది అని చెప్పారు. ఆ తరువాత ఆమె ప్లేస్ ను మీనాక్షీ చౌదరి రీప్లేస్ చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నవీన్ తన సినిమాకు ఏ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తుందో అన్న విషయం అందరికీ తెల్సిందే. ముఖ్యంగా అనగనగా ఒక రాజు సినిమా ప్రమోషన్స్ భాద్యత మొత్తం నవీన్ తన భుజాల మీద వేసుకున్నాడు. ప్రతి పండగకు అందరూ తమ సినిమావైపు తిరిగి చూసేలా ప్రమోషన్స్ చేస్తాడు. మొన్న దసరాకు పల్లెటూరు వెళ్ళి అక్కడున్నవారితో సినిమా గురించి మాట్లాడి దసరా శుభాకాంక్షలు చెప్పించాడు.
ఇక ఇప్పుడు దీపావళీకి కూడా మరో కొత్త కాన్సెప్ట్ తో వచ్చేశాడు. దీపావళీ టపాకాయలు అమ్ముతూ తన సినిమా గురించి చెప్పుకొచ్చాడు. అనగనగా ఒక రాజు ఫుల్ ఎంటర్ టైన్మెంట్. దీపావళీ నుంచి సంక్రాంతి వరకు ఇది పేలుతూనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా అనగనగా ఒక రాజు నుంచి మొదటి సాంగ్ ను త్వరలోనే రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ప్రమోషన్స్ చూసి .. నిజంగా నవీన్ జాతిరత్నం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందకు రానుంది. మరి ఈ సినిమాతో రాజుగారు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Kiran Abbavaram: గ్యాప్ ఇవ్వు అన్నా.. ఇప్పుడేగా హిట్ కొట్టింది.. అప్పుడే ఇంకొకటా
Ram Pothineni: రామ్ చరణ్ ని చూసి జాలేసింది