సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Year Ender 2025: మళ్ళీ వచ్చి మాయాజాలం చేసిన చిత్రాలు..

ABN, Publish Date - Dec 26 , 2025 | 02:02 PM

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఆ నమ్మకంతోనే గతంలో అలరించిన చిత్రాలకు కొత్త సొబగులు అద్ది పలు చిత్రాలను రీ-రిలీజ్ చేశారు... 2025 రీ-రిలీజ్ అయిన చిత్రాలేవో- అవి బాక్సాఫీస్ వద్ద ఎలా సాగాయో చూద్దాం..

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఆ నమ్మకంతోనే గతంలో అలరించిన చిత్రాలకు కొత్త సొబగులు అద్ది పలు చిత్రాలను రీ-రిలీజ్ చేశారు(Tollywood re release hungama)... 2025 రీ-రిలీజ్ అయిన చిత్రాలేవో- అవి బాక్సాఫీస్ వద్ద ఎలా సాగాయో చూద్దాం...(Boxoffice)

టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ (Re release Trend) సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. 2025లో కూడా పాత బ్లాక్‌బస్టర్లు, కల్ట్ క్లాసిక్స్ మళ్లీ థియేటర్లలో సందడి చేశాయి. అభిమానులు కూడా ఈ చిత్రాలను పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు, రీ-రిలీజ్‌లలోనూ చాలా సినిమాలకు హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు వరుస రీ-రిలీజ్‌లు కాగా... కొన్ని రికార్డు వసూళ్లు సాధించగా, మరికొన్ని నాస్టాల్జియాను కలిగించాయి. రొమాన్స్, మాస్, ఎమోషన్, యాక్షన్ అన్ని ఎలిమెంట్లు కలిగిన సినిమాలు రీ-ఎంట్రీ లో అదరగొట్టేశాయి. 2025 జనవరి 1వ తేదీనే 'ఓయ్', 'సై' చిత్రాలు మరోమారు ప్రేక్షకులను పలకరించాయి...

ఫిబ్రవరి నెలలో ప్రేమికుల రోజు స్పెషల్‌గా 'ఆరెంజ్' రీ-ఎంట్రీ ఇచ్చింది. 2023లో చరణ్ బర్త్‌డే కానుకగా వచ్చిన 'ఆరెంజ్' అప్పట్లో మంచి వసూళ్ళు చూసింది... మళ్లీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుందనే అభిలాషతో 'ప్రేమికుల రోజు'న ఈ యేడాది రిలీజ్ చేశారు. ఫిబ్రవరిలోనే సిద్ధు జొన్నల గడ్డ నటించిన రొమాంటిక్ కామెడీ 'కృష్ణ అండ్ హిస్ లీలా'. 'ఇట్స్ కాంప్లికేటెడ్' అనే కొత్త పేరుతో థియేటర్లలో ఫిబ్రవరి 14న రీ-రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాలు అంతగా అలరించలేక పోయాయి...


ఇక మార్చి విషయానికి వస్తే... ఈ నెల సైతం రీ-రిలీజ్‌లతో సందడి చేసింది. 15 సంవత్సరాల తర్వాత కార్తీ, సెల్వరాఘవన్ కాంబోలో వచ్చిన మాస్టర్‌పీస్‌ 'యుగానికొక్కడు' మార్చి 14న గ్రాండ్ గా రీరిలీజైంది. నాని, విజయ్ దేవరకొండ నటించిన 'ఎవడే సుబ్రమణ్యం' పదేళ్లు పూర్తయిన సందర్భంగా మళ్లీ థియేటర్లలో మార్చి 21న సందడి చేసింది. అదే రోజు రెబల్ స్టార్ , ప్రశాంత్ నీల్ కాంబో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం 'సలార్' కూడా మళ్లీ థియేటర్లలో రీ-ఎంట్రీ ఇచ్చింది. 'సలార్' వసూళ్ళ వర్షం కురిపించింది... ఏప్రిల్ 4న నందమూరి బాలకృష్ణ 'ఆదిత్య 369' 4Kలో రీ-రిలీజ్ కాగా ఫ్యాన్స్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. 1991లో లెజండరీ డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ గా వచ్చిన ఈ మూవీ మరోసారి విజువల్ ట్రీట్ ను ఇచ్చింది. 2009లో లెక్కల మాస్టర్ సుకుమార్ తెరకెక్కించిన 'ఆర్య 2' అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా ఏప్రిల్ 5న 4Kలో వచ్చి మంచి వసూళ్ళు రాబట్టింది. మహేశ్ బాబు, కొరటాల శివ కాంబోలో వచ్చిన భరత్ అనే నేను ఏప్రిల్‌లో 7న రీ-రిలీజైంది. 2019లో విశ్వక్ సేన్ నటించిన 'ఫలక్‌నుమా దాస్' ఏప్రిల్ 10న మరోమారు ప్రేక్షకుల ముందు నిలచింది...

35 ఏళ్ల క్రితం రిలీజైన 'జగదేక వీరుడు అతిలోక సుందరి'... మే 9న 2D, 3D వర్షన్ లో రీ-రిలీజ్ అయి మంచి స్పందన సంపాదించుకుంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా అప్పట్లో సోషియో ఫాంటసీ సినిమాల్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా మారింది. అలాంటి ఈ చిత్రం రీరిలీజ్ లో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. అల్లు అర్జున్ నటించిన 'దేశముదురు' మే 10న పెద్ద ఎత్తున అభిమానుల కోసం తిరిగి థియేటర్లలో విడుదలైంది. ఇటు రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ ను మలుపు తిప్పిన 'వర్షం' మూవీ మరోసారి డార్లింగ్ ఫ్యాన్స్ ను అలరించింది. 2004లో వచ్చి హిట్ ను అందుకున్న ఈ మూవీ... మే 23న 4Kలో వచ్చి మళ్లీ సక్సెస్ ను అందుకుంది. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'ఖలేజా' మే 30న రీరిలీజైంది. 4K రిమాస్టర్డ్ వెర్షన్‌లో రీ-రిలీజ్ అయి రికార్డు వసూళ్లు సాధించింది. జూన్‌13న 'అందాల రాక్షసి', జూన్ 30న పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ' 4Kలో రీ-రిలీజ్ అయ్యాయి. పవన్ ఫ్యాన్స్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. జూలై 11న రవితేజ 'మిరపకాయ్', జులై 18న నాగ చైతన్య-సమంత 'ఏ మాయ చేశావే' రీ-రిలీజ్ అయ్యాయి. అదే నెల 25న 'కుమారి 21F' మరోసారి ప్రేక్షకుల ముందు నిలచింది. ఈ మూవీలను చూసి రొమాంటిక్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు.

ఆగస్టు నెల స్టార్స్ బర్త్‌డే స్పెషల్స్‌తో నిండిపోయింది. మహేశ్ బాబు బర్త్ డే ఆగస్టు 9న 'అతడు' 4Kలో జనం ముందు నిలచింది. చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా 'స్టాలిన్' ఆగస్టు 22న రాగా, నాగార్జున బర్త్ డే కానుకగా 29న 'రగడ' కూడా రీ-రిలీజ్ అయ్యాయి. ఆగస్టు 22వ తేదీనే ఆర్‌. నారాయణ మూర్తి లీడ్‌ రోల్‌లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'యూనివర్సిటీ సైతం మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అక్టోబర్ 31న ఎస్‌ఎస్ రాజమౌళి తన 'బాహుబలి' సిరీస్ లోని రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్' టైటిల్ తో మరోమారు ప్రేక్షకుల ముందు నిలిపారు... తెలుగు రీ-రిలీజ్ చరిత్రలో టాప్ గ్రాసర్‌గా నిలిచిందీ మూవీ.

నవంబర్‌ 14న అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ తీసిన కల్ట్ క్లాసిక్ మూవీ 'శివ' 4K డాల్బీ అట్మాస్‌లో రీ-రిలీజ్ అయి 'శివ' చిత్రం భారీ వసూళ్ళు చూసింది. సీనియర్ స్టార్ హీరోస్ రీ-రిలీజ్ మూవీస్ లో 'శివ' టాప్ గా నిలచింది... నవంబర్ 21న చిరంజీవి 'కొదమ సింహం', నవంబర్ 22న కార్తి, తమన్నా నటించిన 'ఆవారా'... నవంబర్ 29న మహేశ్ 'బిజినెస్ మేన్' మళ్లీ థియేటర్లలో సందడి చేశాయి. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ మూవీ 'షోలే' సినిమా 50వ వార్షికోత్సవం సందర్భంగా, "షోలే: ది ఫైనల్ కట్' పేరుతో 4K రిస్టోర్డ్ వెర్షన్‌లో డిసెంబర్ 12న రీ-రిలీజైంది. డిసెంబర్‌లో విక్టరీ వెంకటేశ్ పుట్టినరోజు స్పెషల్‌గా వస్తుందనుకున్న 'పెళ్లి చేసుకుందాం' మూవీ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 4Kలో రీ-రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక డిసెంబర్ 31న మహేశ్ బాబు 'మురారి' రీ-రిలీజ్‌తో ఈ సంవత్సరం ముగిస్తోంది. దీని కోసం ఫ్యాన్స్ ఈవెంట్‌లా ఎదురుచూస్తున్నారు. రాబోయే 2026లో ఏ చిత్రాలు మళ్లీ వస్తాయో చూడాలి.

Updated Date - Dec 26 , 2025 | 02:22 PM