Sadaa: తండ్రి కన్నుమూత.. ఎమోషనల్ అయిన సదా
ABN, Publish Date - Sep 19 , 2025 | 08:00 PM
హీరోయిన్ సదా(Sadaa) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి సయ్యద్ వారం క్రితం కన్నుమూశారు. ఈ విషయాన్నీ సదా తాజాగా అభిమానులతో పంచుకొని ఎమోషనల్ అయ్యింది.
Sadaa: హీరోయిన్ సదా(Sadaa) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి సయ్యద్ వారం క్రితం కన్నుమూశారు. ఈ విషయాన్నీ సదా తాజాగా అభిమానులతో పంచుకొని ఎమోషనల్ అయ్యింది. వారం నుంచి కూడా తన జీవితంలో ఏదో కోల్పోయినట్లు, మనసంతా భారంగా ఉన్నట్లు తెలుపుతూ తండ్రిని తలుచుకొని కన్నీరు మున్నీరు అయ్యింది. ఆయన వ్యక్తిత్వం గురించి, తన తండ్రి తనపై చూపించిన ప్రేమ గురించి చెప్పుకొచ్చింది.
ఒక వారం క్రితం నేను నా తండ్రిని కోల్పోయాను, కానీ ఇప్పటికే అది ఒక శాశ్వత కాలంలా అనిపిస్తోంది. ప్రతి క్షణం మునుపటి క్షణం కంటే బరువైనదిగా అనిపిస్తోంది. ఆయన వదిలిపెట్టిన నిశ్శబ్దం, లేరు అన్న వాస్తవం నన్ను బాధతో నింపేశాయి. నా కలలను సాకారం చేసుకోవడానికి, నేను నా జీవితాన్ని జీవించగలగడానికి, తన జీవితంలో చాలా విషయాలను నిశ్శబ్దంగా త్యాగం చేశాడు.
సినిమా నాలాంటి అమ్మాయిలకు సేఫ్ కాదు అని తెలిసిన రోజుల్లోనే నాకు సపోర్ట్ గా నిలబడ్డారు. నా తల్లి, ఒక అంకితభావంతో కూడిన ప్రభుత్వ ఉద్యోగి, ఎక్కువ కాలం సెలవు తీసుకోలేని సమయం కావడంతో ఆయన తన వైద్య వృత్తిని పక్కన పెట్టి నా సేఫ్టీ కోసం సెట్స్ లో ఎన్నో రాత్రులు గడిపారు. అది కూడా సంవత్సరాల పాటు నాతో వచ్చారు. నా తల్లి ఆ బాధ్యతలు తీసుకున్నకా ఆయన మళ్లీ తన వైద్య వృత్తికి వెళ్లారు. ఒక చిన్న క్లినిక్‌ను మళ్లీ తెరిచి, కొత్త నగరంలో తన ప్రాక్టీస్‌ను మొదటి నుండి ప్రారంభించారు. కెరీర్ కోసం కాదు, గుర్తింపు లేదా డబ్బు కోసం కాదు, కేవలం అవసరమైన వారికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో మాత్రమే.
ఆయన మరణించిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎంతమందికి సేవ చేశారో వారందరూ వచ్చి ఆయన గురించి కథలు కథలుగా చెప్తుంటే వింటున్నాను. జంతువులు కూడా ఆయన సంరక్షణలో ప్రేమ మరియు భద్రతను పొందాయి.నా తండ్రిగా ఉండడం ఎంత గర్వంగా ఉండేదో అని ఎంతోమందికి చెప్పారు. కానీ, ఈరోజు నేను గర్విస్తున్నాను. ఆయనకు కూతురుగా పుట్టినందుకు. నా తండ్రి జీవించిన జీవితం చూసి గర్విస్తున్నాను. ఆయన నిజంగా ఒక వెలకట్టలేని మనిషి. మిస్ యూ పప్పా' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Manasulo Maata: ‘మనసులోని మాట’ వినోదాత్మకం..
Sreeleela: శ్రీలీల మరో జాక్‌పాట్.. సెట్ అయితే దశ తిరిగిపోతుంది..