Jyothi Purvaj: కిల్లర్ నుండి జ్యోతి పూర్వజ్ రక్తిక లుక్
ABN , Publish Date - May 26 , 2025 | 05:55 PM
జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా 'కిల్లర్'. పూర్వజ్ దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తున్న ఈ మూవీ నుండి రక్తికగా జ్యోతి పూర్వజ్ నటిస్తున్న వాంపైర్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
'శుక్ర' (Shukra), 'మాటరాని మౌనమిది' (Matarani Mounamidi), 'ఏ మాస్టర్ పీస్' వంటి డిఫరెంట్ చిత్రాలను తెరకెక్కించాడు పూర్వజ్ (Purvaj). అతని తాజా చిత్రం 'కిల్లర్' సెన్సేషనల్ సై - ఫై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అతనే హీరోగా నటిస్తున్నాడు. అలానే జ్యోతి పూర్వజ్ (Jyothi Purvaj) హీరోయిన్ గా చేస్తోంది. విశాల్ రాజ్, దశరథ, చందు, గౌతమ్ ఇతర ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి.
సోమవారం 'కిల్లర్' మూవీ నుండి హీరోయిన్ జ్యోతి పూర్వజ్ నటించిన 'రక్తిక' క్యారెక్టర్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పాత్రలో ఆమె వాంపైర్ లుక్ లో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో... ఇలాంటి ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందుతోంది. అతి త్వరలోనే ఈ సినిమాను జనం ముందుకు తీసుకొస్తామని మేకర్స్ తెలిపారు.
Also Read: Naveen Polishetty: సంక్రాంతి కానుకగా అనగనగా ఒక రాజు
Also Read: Venky - Trivikram Movie: రుక్మిణీ వసంత్ కు గోల్డెన్ ఛాన్స్...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి