Naveen Polishetty: సంక్రాంతి కానుకగా అనగనగా ఒక రాజు
ABN , Publish Date - May 26 , 2025 | 05:21 PM
నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న మూవీ 'అనగనగా ఒక రాజు'. ఈ సినిమా వచ్చే జనవరి 14న జనం ముందుకు రాబోతోంది.
వినోద చిత్రాల కథానాయకుడిగా చక్కని పేరు తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty). అతని తాజా చిత్రం 'అనగనగా ఒక రాజు' (Anaganaga Oka Raju). ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) నాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ చక్కని ఆదరణ పొందడమే కాకుండా సినిమా పై హైప్ ను క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ లాక్ చేశారు. ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయబోతున్నారు. అయితే ఇప్పటికే సంక్రాంతి సీజన్ లో చిరంజీవి (Chiranjeevi), అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమా విడుదల కానుంది. అలానే విజయ్ (Vijay) అనువాద చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) కూడా పొంగల్ కే రాబోతోంది.
తెలుగు సినీ అభిమానులు సంక్రాంతిని సినిమా పండుగలా భావిస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ లకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే పండుగకి సరైన సినిమాగా 'అనగనగా ఒక రాజు' వచ్చే సంక్రాంతికి థియేటర్లలో అడుగుపెట్టనుందని నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య తెలిపారు. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మిక్కీ జే మేయర్ (Mickey J Meyer) సంగీతం అందిస్తున్నారు. పండుగ రుచికి సరిగ్గా సరిపోయేలా ఆయన తనదైన మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేయనున్నారని మేకర్స్ చెప్పారు. తమ సంస్థ నుండి ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన బాలకృష్ణ (Balakrishna) 'డాకు మహారాజ్' బ్లాక్ బస్టర్ గా నిలిచిందని, 2026 సంక్రాంతికి 'అనగనగ ఒక రాజు'తో మరో పండగ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంటామనే ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Theatres bundh: దిల్ రాజు వివరణ
Also Read: Venky - Trivikram Movie: రుక్మిణీ వసంత్ కు గోల్డెన్ ఛాన్స్...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి