సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Koratala Siva: కొరటాల పని అయిపోయిందా.. ఎంత మాట అన్నారు

ABN, Publish Date - Nov 25 , 2025 | 09:11 PM

ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు హై లో ఉంటారు.. ఎవరు ఎప్పుడు లో లో ఉంటారు అని చెప్పడం చాలా కష్టం. ఒకప్పుడు స్టార్ హీరోలకు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ పరిస్థితి ఇప్పుడు చాలా కష్టంగా మారింది.

Koratala Siva

Koratala Siva: ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు హై లో ఉంటారు.. ఎవరు ఎప్పుడు లో లో ఉంటారు అని చెప్పడం చాలా కష్టం. ఒకప్పుడు స్టార్ హీరోలకు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ పరిస్థితి ఇప్పుడు చాలా కష్టంగా మారింది. సినిమాలు లేక, ప్రాజెక్ట్స్ రాక చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. అలాంటి డైరెక్టర్స్ లో డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కూడా ఉన్నాడని తెలుస్తోంది. ఒకప్పుడు పరాజయమే ఎరుగని దర్శకుల లిస్ట్ లో రాజమౌళి తరువాత కొరటాల శివ పేరు ఉండేది. ఒక్క సినిమా .. ఒకే ఒక్క సినిమా అతడిని అథః పాతాళానికి నెట్టేసింది. అదే ఆచార్య.

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. సినిమా హిట్ అయితే హీరో ఖాతాలోకి.. ప్లాప్ అయితే డైరెక్టర్ ఖాతాలోకి అని టాలీవుడ్ లో చాలామంది చెప్పుకొస్తారు. అలానే ఆచార్య కొరటాల ఖాతాలో పడింది. పాదఘట్టం అనే పేరు ఆశ్చర్యంలో ఎన్నిసార్లు వచ్చిందో దానికి డబుల్, త్రిబుల్ విమర్శలు కొరటాల మీద పడ్డాయి.

ఇక ఆచార్య డిజాస్టర్ నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడి దేవరను పట్టాలెక్కించాడు. ఎలాంటి తప్పు జరగకుండా ఒక శిల్పం చెక్కినట్లు చెక్కి ప్రేక్షకుల ముందు వదిలితే మంచి విజయాన్ని అందుకుంది. హిట్ తరువాత అయినా కొరటాల లైఫ్ మారుతుంది అనుకుంటే.. అది లేదు. దేవర తరువాత ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్ట్ మొదలుపెట్టింది లేదు. అందుతున్న సమాచారం ప్రకారం దేవర 2 కూడా ఆగిపోయిందని తెలుస్తోంది.

ప్రస్తుతం కొరటాల పరిస్థితి దారుణంగా ఉందని తెలుస్తోంది. సీనియర్ హీరోలు కాకుండా మిగతావారితో చేయడానికి చూస్తున్నాడట. మిడ్ రేంజ్ హీరోలు అస్సలు ఖాళీ లేరు. ఇక కుర్ర హీరోలు అయిన రామ్, నాగ చైతన్యకు ఈమధ్యనే కొరటాల తన స్క్రిప్ట్స్ ను వినిపించాడట. అయితే తాను డైరెక్ట్ చేయకుండా కేవలం సూపర్ వైజింగ్ మాత్రమే చేస్తానని చెప్పాడట. కానీ, ఇద్దరు ఆ స్క్రిప్ట్ ను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. దేవర లాంటి హిట్ అందుకున్నాకా కూడా కొరటాల ఒక ప్రాజెక్ట్ కోసం ఇంతలా కష్టపడడంతో ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపం.. కొరటాల అంటూ సానుభూతి చూపిస్తున్నారు. ఇంకొంతమంది కోరల పని అయ్యిపోయింది అంటూ చెప్పుకొస్తున్నారు. మరి కొరటాల బౌన్స్ బ్యాక్ ఎప్పుడు అవుతాడు అనేది చూడాలి.

Updated Date - Nov 25 , 2025 | 09:13 PM