Ravi Teja: టాలీవుడ్‌లో మరో విషాదం.. రవితేజ తండ్రి కన్నుమూత
ABN , Publish Date - Jul 16 , 2025 | 07:17 AM
టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. మాస్ మహారాజా రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు (90) మంగళ వారం రాత్రి కన్నుమూశారు.
టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) తండ్రి రాజగోపాల్ రాజు (90) (Bhupathiraju Rajagopal Raju) మంగళ వారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా వయో భారం, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన హైదరాబాదులోని రవితేజ నివాసంలో తుది శ్వాస విడిచారు.
ఈ రోజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు వారి కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం తెలుపుతున్నారు.
రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ వృత్తి రీత్యా ఫార్మసిస్ట్ గా పని చేసేవారు. ఈ నేపథ్యంలో ఆయన పలు ప్రాంతాలలో ఉద్యోగం చేయాల్సి రావడంతో తాను అనేక ప్రాంతాలు చిన్నప్పుడే తిరగాల్సి వచ్చిందని రవితేజ పలు సందర్భాలలో పంచుకున్నారు. అలా అనేక ప్రాంతాలలో పనిచేస్తూ రావడంతోనే రవితేజకు అనేక యాసలు ఒంటబట్టాయని కూడా సన్నిహితులు చెబుతూ ఉంటారు.
ఇక రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు రవితేజ, రఘు, భరత్ రాజు. ఇక భూపతి రాజు రాజగోపాల్ రాజు స్వగ్రామం ఆంధ్ర ప్రదేశ్ లోని జగ్గంపేట.
మెగాస్టార్ చిరంజీవి సహా చాలా మంది ప్రముఖులు రవితేజ తండ్రి మృతికి సంతాపం తెలియ జేస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా.. సోదరుడు రవి తేజ తండ్రి రాజ గోపాల్ రాజు గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన్ని ఆఖరిసారిగా వాల్తేర్ వీరయ్య సెట్లో కలిశాను. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని మెగాస్టార్ చిరంజీవి ఓ పోస్ట్ సైతం పెట్టారు.