Trinadha Rao Nakkina: ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో హవీష్
ABN, Publish Date - Jun 18 , 2025 | 02:39 PM
హవీష్ హీరోగా త్రినాథరావు నక్కిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్ (Havish), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు (Trinadha Rao Nakkina) కాంబోలో క్రేజీ మూవీ ఒకటి రూపుదిద్దుకుంటోంది.
'నువ్విలా (Nuvvila), జీనియస్, రామ్ లీలా, సెవెన్' వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హవీష్. అలానే 'సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా (Dhamaka), మజాక (Mazaka)' వంటి చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్ లో త్రినాథరావు నక్కిన కూ మంచి పేరుంది. వీరిద్దరి కలయికలో నిఖిల్ కోనేరు సినిమాను నిర్మిస్తోంది.
Also Read: Tollywood: యంగ్ హీరోస్ పరిస్థితేంటీ...
Also Read: Trisha Krishnan: పరాజయాల్లో డబుల్ హ్యాట్రిక్