సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chiranjjevi: అత‌ను.. టార్గెట్ చేశాడు! చర్యలు తీసుకోండి

ABN, Publish Date - Oct 30 , 2025 | 09:23 AM

సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ హీరో చిరంజీవి (Daya Chowdary) బుధవారం మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

Chiranjeevi

సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ హీరో చిరంజీవి (Chiranjeevi) బుధవారం మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనపై అభ్యంతకర పోస్టులు పెడుతూ, దుర్భాషలాడుతున్న కొన్ని ఎక్స్ హ్యాండిల్ ప్రొఫైల్‌పై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముఖ్యంగా దయాచౌదరి (Daya Chowdary) అనే వ్యక్తి తనను లక్ష్యంగా చేసుకొని దూషణకు పాల్పడుతున్నాడనీ, అతనిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని చిరంజీవి పోలీసులను కోరారు.

కొందరు తన ఫొటోలను మార్ఫింగ్ చేసి డిజిటల్ ఫ్లాట్ఫామ్‌ల‌పై వైరల్ చేస్తున్నారని ఇటీవలే చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చిరంజీవి పేరు, ఫొటోలు, గొంతును ఆయన అనుమతి లేకుండా ఎవరూ ఉపయోగించకూడదని సిటీ సివిల్ కోర్టు ఇటీవ‌లే ఉత్తర్వులు జారీ చేసింది. అయినా మెగాస్టార్ పేరును వాడ‌డంపై ఆయ‌న పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌క త‌ప్ప‌లేదు.

Updated Date - Oct 30 , 2025 | 09:23 AM