సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అఖండ 2లో బజరంగీ భాయిజాన్‌ బాలనటి

ABN, Publish Date - Jul 03 , 2025 | 05:40 AM

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రం ‘అఖండ 2’. ఇది 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ సాధించిన ‘అఖండ’కు కొనసాగింపు భాగం...

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రం ‘అఖండ 2’. ఇది 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ సాధించిన ‘అఖండ’కు కొనసాగింపు భాగం. రామ్‌ అచంట, గోపీ అచంట నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా సెప్టెంబరు 25న విడుదలవుతోంది. తాజాగా, ఈ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్‌ చిత్రం ‘బజరంగీ భాయిజాన్‌’లో బాలనటిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న హర్షాలీ మల్హోత్రా ఎంటరయ్యారు. ఆమె ‘జననీ’ అనే పాత్రను పోషిస్తున్నట్లు టీమ్‌ ప్రకటించింది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, సంయుక్త కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలె విడుదలైన గ్లింప్స్‌ చిత్రం ఎలా ఉండబోతోందో హింట్‌ ఇచ్చింది.

Updated Date - Jul 03 , 2025 | 05:40 AM