Harish Shankar: ఉస్తాద్ అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్..

ABN , Publish Date - Jun 03 , 2025 | 05:14 PM

ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) .  వీరమల్లు జూన్ 12 న రిలీజ్ కు రెడీ అవుతోంది.

ustaad bhagat singh

మిస్టర్ బచ్చన్(Mr. Bachchan) సినిమాతో పరాజయం అందుకున్నాడు డైరెక్టర్  హరీష్ శంకర్(Harish Shankar). ఎన్ని  ప్లాప్స్ వచ్చినా సరే హరీష్ ఎలాగైనా  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో గబ్బర్ సింగ్ లాంటి మరో హిట్ సినిమాను తీయాలని  ఎదురుచూస్తూనే ఉన్నాడు. జనసేనలోకి వెళ్ళాకా పవన్ సినిమాలకు దూరమయ్యాడు. పదవి వచ్చాక పూర్తిగా దూరమయ్యాడు. కానీ,  అప్పటికే ఒప్పుకున్నా ప్రాజెక్ట్స్ ను మాత్రం వదలకుండా ఏదో విధంగా ఫినిష్ చేసి.. నిర్మాతలను గట్టెక్కించాలని చూస్తున్నాడు.

 

 

ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) .  వీరమల్లు జూన్ 12 న రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా వాయిదా పడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కాకుండా పవన్ నటిస్తున్న మరో చిత్రం OG . సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కనీసం ఈ రెండు సినిమాలు షూటింగ్ వరకు వెళ్లి ఆగాయి. కానీ,  ఉస్తాద్ భగత్ సింగ్  షూటింగ్ ని కూడా మొదలుపెట్టలేదని తెలుస్తోంది.

 

Also Read: అందాలతో అదరగొట్టేస్తున్న అఖండ భామ..

పోస్టర్స్  కోసం, వీడియో కోసం చేసిన షూట్ లో మాత్రమే పవన్ కనిపించాడు. ఎన్నేళ్లు అయినా పర్లేదు పవన్ తో ఉస్తాద్ ను పూర్తి చేస్తానని హరీష్ కంకణం కట్టుకొని కూర్చున్నాడు.  ఇక తాజాగా హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ ను అందించాడు. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఉస్తాద్ షూటింగ్ గురించి అప్డేట్ ఇచ్చాడు.

 

 

జూన్ రెండో వారంలో ఉస్తాద్ షూటింగ్ మళ్లీ మొదలు కానుందని, మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers)  ఉస్తాద్ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా కేవలం 45 రోజుల్లోనే  సినిమా పూర్తిచేసే ప్లాన్ లో ఉన్నట్లు  కూడా చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనేది  కాలమే నిర్ణయించాలి. 

Updated Date - Jun 03 , 2025 | 05:14 PM