Harish Shankar- Dil Raju : దిల్ రాజుతో హరీష్ శంకర్
ABN , Publish Date - Aug 13 , 2025 | 06:21 PM
కొన్ని కాంబినేషన్లు... అనౌన్స్మెంట్ నుంచే ఆకర్షిస్తుంటాయి. సెట్స్ పైకి వెళ్లకపోయినా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. అలాంటి ఓ హిట్ కాంబినేషన్ మళ్లీ తెరపైకి రాబోతోంది. అదిరిపోయే క్యాస్టింగ్తో థ్రిల్ చేయబోతోంది. అదేంటో చూద్దామా…
టాలీవుడ్లో తమకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న నిర్మాణ సంస్థ.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations ). దిల్ రాజు (Dil Raju ) నేతృత్వంలోని ఈ సంస్థ హిట్ సినిమాలకు పెట్టింది పేరు. ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించింది ఈ సంస్థ. ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటేనే అంచనాలు పెరిగిపోతుంటాయి. ఇటీవల కాలంలో ఆ క్రెడిబిలిటీని కొంచెం పోగొట్టుకున్న ఈ సంస్థ తాజాగా తమ బ్యానర్తో కలిసి బాక్సాఫీస్ వద్ద డీజే మోగించిన డైరెక్టర్ హరీశ్ శంకర్తో సినిమా చేయబోతోందన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
దిల్ రాజు(DIL Raju), హరీశ్ శంకర్ (Harish Shankar) మధ్య మంచి బాండింగ్ ఉంది. వీరి కాంబోలో గతంలో 'రామయ్యా వస్తావయ్యా' (Ramayya Vasthavayya), 'సుబ్రమణ్యం ఫర్ సేల్' (Subramanyam For Sale) , 'దువ్వాడ జగన్నాథం (Duvvada Jagannadham)' లాంటి సినిమాలు వచ్చాయి. వీటిలో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సూపర్ హిట్ కాగా, ‘దువ్వాడ జగన్నాథం’ హిట్ అనిపించుకుంది. ఇప్పుడు నాలుగో ఫిల్మ్గా వీరి కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్టు రాబోతోందట. చాలా ఏళ్ల తర్వాత కలిసి పనిచేయబోతున్న ఈ ఇద్దరు ఓ స్టార్ హీరోతో ఈ ప్రాజెక్ట్ ను తీయబోతున్నారట. ఈ సినిమా వారిద్దరి రీ-యూనియన్ కు ఓ స్పెషల్ ప్రాజెక్ట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం హరీశ్ శంకర్, పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustad Bhagat Singh) సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సెప్టెంబర్ చివరి నాటికి షూటింగ్ పూర్తవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి కానీ సమ్మర్ లో కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ మూవీ పూర్తయ్యాక, హరీశ్, దిల్ రాజు కొత్త సినిమా పనులు ఆరంభిస్తారట. టైటిల్, హీరో, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. మరి హరీశ్ ఎలాంటి కథతో మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
Read Also: Chitrapuri Colony Issue: చిత్రపురి కాలనీలో.. రూ.300 కోట్ల స్కాం! కార్మికుల ధర్నా
Read Also: Anil Sunkara: అనిల్ సుంకర షో టైమ్..