సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Harihara Veeramallu: వీరమల్లు ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

ABN, Publish Date - Jun 28 , 2025 | 09:52 PM

హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) కోసం ఎదురుచూసినంతగా ఇండస్ట్రీలో ఏ సినిమా కోసం అభిమానులు ఇంతగా ఎదురుచూడలేదు అంటే అతిశయోక్తి కాదు.

Hari Hara Veeramallu

Harihara Veeramallu: హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) కోసం ఎదురుచూసినంతగా ఇండస్ట్రీలో ఏ సినిమా కోసం అభిమానులు ఇంతగా ఎదురుచూడలేదు అంటే అతిశయోక్తి కాదు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వమలో తెరకెక్కిన ఈ సినిమాను ఏఎం రత్నం ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


అయితే అన్నీ బావున్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. కంటెంట్ మొత్తం బావున్నా రిలీజ్ డేట్ విషయంలోనే మేకర్స్.. ప్రేక్షకులకు అసహనం తెప్పిస్తున్నారు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. లెక్కలేనన్ని సార్లు వీరమల్లు రిలీజ్ డేట్ ప్రకటించడం, తరువాత వాయిదా పడడం. ఒక్కోసారి ఒక్కో రీజన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని పాత్రలోకనిపిస్తున్నాడు. మొఘల్ శక్తిని ధిక్కరించిన ఓ ధైర్యవంతుడి ప్రయాణంగా వీరమల్లు తెరకెక్కింది అనే ఒకే ఒక్క కారణంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్ని వాయిదాలు పడినా సినిమాపై అభిమానులు మంచి అంచనాలనే పెట్టుకున్నారు.


ఎన్నో వాయిదాల తరువాత హరిహర వీరమల్లు జూలై 24 న ప్రేక్షకుల ముందకు రానుంది. ఈసారి మాత్రం పక్కా రిలీజ్ అని అంటున్నారు. ఇక అందుకు తగ్గట్లుగానే ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. హరిహర వీరమల్లు ట్రైలర్ ను జూలై 3వ తేదీ ఉదయం 11. 10 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇక దీంతో అభిమానులు ట్రైలర్ కోసం హైప్ పెంచుకుంటున్నారు. ఇక ట్రైలర్ తో బిజినెస్ లెక్కలు మారి.. సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతాయని అంటున్నారు. మరి ఈసారైనా వీరమల్లు చెప్పిన తేదీకి వస్తాడా.. ? లేదా అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Updated Date - Jun 28 , 2025 | 09:52 PM