వీరమల్లు వస్తున్నాడు
ABN, Publish Date - Jun 22 , 2025 | 04:16 AM
పవన్ కల్యాణ్ యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. నిధి అగర్వాల్ కథానాయిక. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ తెరకెక్కించారు...
పవన్ కల్యాణ్ యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. నిధి అగర్వాల్ కథానాయిక. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ తెరకెక్కించారు. ఏ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ.దయాకర్ రావు నిర్మించారు. ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. జూలై 24న ‘హరిహర వీరమల్లు’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ శనివారం ప్రకటించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.