Barabar Premistha: రాడ్డు.. దింపుతా అంటున్న యాటిట్యూడ్ స్టార్! ఎవడురా అంత పోటుగాడు లిరికల్ సాంగ్ రిలీజ్
ABN, Publish Date - Aug 20 , 2025 | 06:48 AM
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ కథానాయకుడిగా సంపత్ రుద్ర దర్శకత్వం వహించిన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’.
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ (Chandrahass) కథానాయకుడిగా సంపత్ రుద్ర (Sampath Rudra) దర్శకత్వం వహించిన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’(Barabar Premistha). గెడాచందు (Geda Chandu), గాయత్రి చిన్ని (Gayatri Chinni), ఏవీఆర్ (Avr) నిర్మించారు. మేఘనా ముఖర్జీ కథానాయిక (Megna Mukherjee). అర్జున్ మహీ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
అయితే.. అప్పుడెప్పెడో ఆరేడు నెలల కిందట ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ చిత్రం నుంచి ఎవడు ఎవడురా అంత పోటుగాడు.. రండిరా రండిరా దింపుతాను రాడ్డు.. టచ్ చేసి చూడు మీ పుచ్చ లేవదా అంటూ సాగే ఓ ర్యాప్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటకు రోల్ రైడా (Roll Rida) సాహిత్యం అందించగా ఆర్ దృవన్ (RR Dhruvan) సంగీతం అందించి ఆలపించాడు. గణేశ్ మాస్టర్ నృత్యం సమకూర్చాడు.
కాగా ఈ పాట వింటుంటే ట్రోలర్స్ ను దృష్టి పెట్టుకుని రాసినట్టుగా ఉంది. ఇటీవల వచ్చిన మాస్ జాతర పాటలానే ఇందులోనూ నీ అక్క , గుడ్డలూడదీసి కొడతా, బొక్కలిరగకొడతా అనే తెలంగాణలో ఎక్కువగా వాడే పదాలు వాడి తమ ప్రతిభ చూపించారు.ఈ సినిమా సెప్టెంబర్‌లో థియేటర్లలోకి రానుంది.