సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆగస్టులో గామా అవార్డులు

ABN, Publish Date - Jun 25 , 2025 | 05:16 AM

ప్రతిష్ఠాత్మకమైన ‘గామా’(గల్ఫ్‌ అకాడెమీ మూవీ అవార్డ్స్‌)కు టాలీవుడ్‌లో ప్రత్యేకత ఉంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగుసార్లు ఈ అవార్డుల...

ప్రతిష్ఠాత్మకమైన ‘గామా’(గల్ఫ్‌ అకాడెమీ మూవీ అవార్డ్స్‌)కు టాలీవుడ్‌లో ప్రత్యేకత ఉంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగుసార్లు ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తాజాగా 5వ ఎడిషన్‌(2025) వేడుకలు ఆగస్టు 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 5వ ఎడిషన్‌కు సంబంధించిన థీమ్‌ సాంగ్‌ను దుబాయ్‌లో లాంచ్‌ చేశారు. చంద్రబోస్‌ సాహిత్యాన్ని అందించారు. రఘు కుంచె స్వరాలు సమకూర్చడంతో పాటు స్వయంగా ఆలపించారు. ఈ సందర్భంగా గామా అవార్డ్స్‌ చైర్మన్‌ త్రిమూర్తులు మాట్లాడుతూ ‘ఆగస్టు 30న నిర్వహించబోయే 5వ ఎడిషన్‌కు తెలుగువారందరూ హాజరై విజయవంతం చేయాలి’ అని కోరారు.

Updated Date - Jun 25 , 2025 | 05:23 AM