Garividi Lakshmi Film: ఓ కళాకారిణి కథ..
ABN, Publish Date - Jul 19 , 2025 | 05:34 AM
ఆనంది ప్రధాన పాత్రలో గౌరీ నాయుడు జమ్ము తెరకెక్కిస్తోన్న సినిమా గరివిడి లక్ష్మి
ఆనంది ప్రధాన పాత్రలో గౌరీ నాయుడు జమ్ము తెరకెక్కిస్తోన్న సినిమా ‘గరివిడి లక్ష్మి’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్‌పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఆనందిని ‘గరివిడి లక్ష్మి’ పాత్రలో పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. లంగా, ఓణి ధరించి, రిక్షాలో కూర్చున్న ఆనంది.. ఒడిలో హోర్మోనియంతో ఆకట్టుకున్నారు. గరివిడి లక్ష్మి ఒక గొప్ప బుర్రకథ కళాకారిణి. ఉత్తరాంధ్ర జానపద సంప్రదాయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఈ సినిమాలో చరణ్ అర్జున్ సంగీతం ఉత్తరాంధ్ర సంస్కృతిని ఆవిష్కరిస్తూ హృదయాన్ని తాకేలా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి